Mirror Placement: ఇంట్లో అద్దం సరైన ప్లేస్‌లోనే ఉందా?.. మీరు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

|

Oct 18, 2021 | 6:33 AM

Mirror Placement: ఒక కుటుంబం అన్ని విధాలుగా బాగుండాలంటే కొన్ని వాస్తు పద్ధతులను కూడా పాటించాల్సి ఉంటుందని జ్యోతిష్క్యులు, పండితులు, వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Mirror Placement: ఇంట్లో అద్దం సరైన ప్లేస్‌లోనే ఉందా?.. మీరు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
Mirror
Follow us on

Mirror Placement: ఒక కుటుంబం అన్ని విధాలుగా బాగుండాలంటే కొన్ని వాస్తు పద్ధతులను కూడా పాటించాల్సి ఉంటుందని జ్యోతిష్క్యులు, పండితులు, వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం నివసించే ఇళ్లు, ఇంట్లో ఉండే వస్తువులన్నింటినీ వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తారు. పెద్దలు సైతం ఇదే మాట చెబుతున్నారు. వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో ఉన్నా.. ఆ ఇంట్లో వాస్తు ప్రకారం వస్తువులు ఏర్పాటు చేసినా సదరు కుటుంబానికి అన్ని విధాలుగా మంచి జరుగుతుందని అభిప్రాయం, విశ్వాసం.

ఐదు అంశాల ఆధారంగా వాస్తు శాస్త్రంలో ఇంట్లో వస్తువులు పెట్టడానికి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని తూచా తప్పకుండా పాటించడం ద్వారా ఆనందంగా, అర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఒకవేళ వాటిని విస్మరించినట్లయితే వివిధ రకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మనం రోజు ఉదయం లేవగానే అద్దంలోనే మొఖం చూసూకుంటాం. మరి ఆ అద్దం ఇంట్లో ఏ వైపున ఏర్పాటు చేయాలో తెలుసా? అద్దం ఇంట్లో ఏ వైపున పెడితే మంచి జరుగుతుందో తెలుసా?. అద్దం సరైన దిశలో పెట్టడం ద్వారా అదృష్టాన్నిస్తుందని, అసంబద్ధంగా పెడితే దురుదృష్టాన్ని తెస్తుందని విశ్వాసం. అందుకే అద్దం ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై వాస్తు నిపుణులు పలు సూచనలు, సలహాలు చేశారు. మరి ఆ సూచనలు, సలహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం..
1. ఇంటికి ఆగ్నేయంలో అద్దం ఉంచినట్లయితే ఆ ఇంట్లో పరిస్థితి అల్లకల్లోలమే. ఆగ్నేయ దిశలో అద్దం పెట్టడం ద్వారా.. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విభేదాలు, తగువులు పెరుగుతాయి. ఈ వాస్తు దోషం కారంగా వైవాహిక జీవితంలో అసమ్మతి పెరిగి.. అది విడిపోవడానికి కారణం అవుతుంది.
2. నైరుతి దిశలో అద్దం ఏర్పాటు చేసినట్లయితే.. ఇంటి పెద్దపై చెడు ప్రభావం చూపుతుంది. అనవసర ఖర్చుల భారం పెరుగుతుంది. ఎప్పుడూ అశాంతితో, చికాకులతో ఉంటారు.
3. ఇంటికి వాయువ్య దిశలో అద్దం ఉంచినట్లయితే.. అనవసరమైన గొడవలు, శత్రుత్వాలు పెరుగుతాయి.
4. పశ్చిమ దిశలో అద్దం ఉంచినట్లయితే.. కుటుంబ సభ్యులలో సోమరితనాన్ని సృష్టిస్తుంది.
5. అద్దం ఎల్లప్పుడూ తూర్పు, ఉత్తరం వైపు పెట్టాలి(అంటే తూర్పు, ఉత్తరం గోడ వైపునకు). అద్దం చూసే వారి ముఖం ఎప్పుడూ తూర్పు లేదా, ఉత్తరం వైపు ఉండాలి. వాస్తు ప్రకారం ఈ రెండు దిశలలో అద్దం పెడితే.. ఎల్లప్పుడూ సానుకూల శక్తి వస్తుంది.
6. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే.. బెడ్‌రూమ్‌లో అద్దం దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి. మంచం ఆ అద్దంలో కనిపించని ప్రదేశంలో ఏర్పాటు చేయండి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. నిద్రపోతున్నప్పుడు మీ అద్దాన్ని ఒక తెరతో కప్పి పెట్టండి. ఇలా చేయడం ద్వారా అద్దం వల్ల తలెత్తే వాస్తు దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

గమనిక: ఇది కేవలం వాస్తు శాస్త్రం ప్రకారం, ఆచార విశ్వాసాల ప్రకారం మాత్రమే చెప్పబడింది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఖచ్చితత్వం లేదు. కావున పాఠకులు దీనిని గమనించగలరు.

Also read:

Health Benefits: బొప్పాయితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?.. షాకింగ్ విశేషాలు మీకోసం..

Road Accident: మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. క్షణాల్లో మాంసపు ముద్దలుగా తల్లీ, కొడుకు

Head Constable: పట్టపగలే డ్యూటీలో ఉండగా మందు తాగుతున్న పోలీస్.. రూల్స్ వీళ్ళకి వర్తించవా అంటున్న జనం