Telugu News Spiritual Karthika Masam 2024: Start and End Date , know the important days in telugu
Karthika Masam: ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం రేపే ప్రారంభం.. ఈ నెలలో విశేష పండగలు, పర్వదినాలు, పోలి స్వర్గం ఎప్పుడంటే..
కార్తీక మాసపు వేకువ వేళల్లో తులారాశిలో సంచరిస్తాడు. ఈ సమయంలో నదీస్నానం చాలా మంచిది. అంతేకాదు సూర్యాస్తమయానికి ముందుగా దేవాలయాల్లో 'ఆకాశదీపం' వెలిగిస్తారు. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపాన్ని భావిస్తారు. అయితే కార్తీక మాసం రేపటి నుంచి అంటే నవంబరు 02వ తేదీ శనివారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కార్తీక మాసం విశేషాలు, పండగల గురించి తెలుసుకుందాం..
మాసాల్లోకెల్లా ఉత్తమైన మాసం కార్తీక మాసం. ఆధ్యాత్మికంగా దివ్యమైన కార్తీక మాసంలో చేసే స్నానానికి విశిష్టమైన స్థానం ఉంది. సర్వ మంగళకర మాసమైన కార్తీక మాసంలో శివ కేశవులను పుజిస్తారు. ఇది దామోదర మాసం కనుక ‘కార్తిక దామోదర’ అనే నామంతో స్మరణ చేస్తారు.సూర్యోదయానికి ముందే బ్రహ్మ మూహుర్తంలో అభ్యంగన స్నానమాచరిస్తారు. ఈ నెలలో వెలిగించే దీపం శుభకరం అని నమ్మకం. అయితే కార్తీక మాసం రేపటి నుంచి అంటే నవంబరు 02వ తేదీ శనివారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కార్తీక మాసం విశేషాలు, పండగల గురించి తెలుసుకుందాం..
నవంబరు 02 వ తేదీ శనివారం నుంచి కార్తీక మాసం ప్రారంభం
నవంబరు 03వ తేదీ ఆదివారం యమ విదియ- భగినీహస్త భోజనం అంటే అన్నాచెల్లెళ్ల పండగ