Kanipakam: రేపటి నుంచి వరసిద్ధి వినాయకుడి గుడిలో ఉచిత అన్నదాన కార్యక్రమం.. ఆగస్టు 7న మహా కుంభాభిషేకం

Kanipakam: సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కిన కాణిపాకం వరసిద్ధి వినాయకుడు(Vara Siddhi Vinayaka) క్షేత్రం.. శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. చిత్తూరు జిల్లాలోని(Chittoor District) కాణిపాకం..

Kanipakam: రేపటి నుంచి వరసిద్ధి వినాయకుడి గుడిలో ఉచిత అన్నదాన కార్యక్రమం.. ఆగస్టు 7న మహా కుంభాభిషేకం
Kanipakam Temple

Updated on: Apr 28, 2022 | 5:22 PM

Kanipakam: సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కిన కాణిపాకం వరసిద్ధి వినాయకుడు(Vara Siddhi Vinayaka) క్షేత్రం.. శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. చిత్తూరు జిల్లాలోని(Chittoor District) కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఉన్న వినాయకుడు వరసిద్ధి వినాయకుడిగా పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడ వినాయకుడు సర్వమత ఆరాధ్యుడు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ దర్శిస్తారు. తమ మొక్కులు తీర్చుకుంటారు. నిత్యం భారీ సంఖ్యలో వరసిద్ధి వినాయకుడి ఆలయానికి భక్తులు వస్తారు. ఈ నేపధ్యంలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం పాలక మండలి సమావేశమయ్యింది. ఈ సమావేశంలో ఈఓ సురేష్ బాబు, ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రేపటి నుంచి భక్తులకు ఉచిత అన్నదానం కార్యక్రమం చేపట్టనున్నారు. స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నదానం చేయనున్నారు. ఆలయం పునర్నిర్మాణం పనులు వేగవంతం చేసి ఆలయానికి ఆగస్టు 7న మహా కుంభాభిషేకం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేయనున్నారు.  గతంలో పాలకమండలి లో ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.

Also Read:

Janasena: మాటలే కానీ చేతలు ఎక్కడ.. మహిళలకు రక్షణ లేదంటూ.. ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడిన జనసేన

Viral News: ఆరేళ్ల కొడుకుతో తండ్రి అగ్రీమెంట్.. షాక్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!

Astro Tips: డబ్బు ఇబ్బందులు పడుతున్న గురు బలం లేనివారు.. గురువారం పాటించాల్సిన నివారణ చర్యలు ఏమిటంటే..