నేపాల్ లో ప్రళయం.. మానస సరోవర్ యాత్రకు బ్రేక్.. యాత్రకు అంత విశిష్టత ఏంటి?

నేపాల్-టిబెట్ ప్రాంతాలలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా కైలాస మానస సరోవర్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. జలప్రళయం వల్ల రోడ్డు మార్గాలు దెబ్బతినడంతో అధికారులు నెల రోజులు మానస సరోవరం మార్గాన్ని మూసివేశారు. అత్యంత సాససోపేత యాత్రగా చెప్పబడే యాత్రకు ఎందుకంత ప్రాముఖ్యత?

నేపాల్ లో ప్రళయం.. మానస సరోవర్ యాత్రకు బ్రేక్.. యాత్రకు అంత విశిష్టత ఏంటి?
Mansarovar Yatra Indian Pilgrims Go Missing After Nepal Flash Floods

Updated on: Aug 27, 2026 | 5:04 PM

గురువారం నాడు ఖాట్మాండ్ నుంచి జరగాల్సిన సరోవర్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి, టూరిస్టులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని నేపాల్-టిబెట్ బోర్డర్ అధికారులు సూచించారు.  అయితే అత్యంత సాససోపేత యాత్రగా చెప్పబడే యాత్రకు ఎందుకంత ప్రాముఖ్యత? తెలుసుకుందాం పదండి.

ఈ యాత్ర ఎందుకు అంత ప్రమాదకరం?

 సముద్ర మట్టానికి దాదాపు 14 వేల నుంచి 19 వేల అడుగుల ఎత్తులో ఈ యాత్ర సాగుతుంది. ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి, కళ్లు తిరగడం తలెత్తుతాయి.  కైలాస పర్వతం చుట్టూ 52 కిలోమీటర్ల  ప్రదక్షిణను పూర్తి చేయడానికి మూడు రోజులు పడుతుంది. అంతేకాకుండా ఆ మార్గం రాళ్లతో, ఎగుడుదిగుడుగా ఉంటుంది దాంతో కీళ్లు, పాదాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.

మహా సాహస యాత్ర కైలాస యాత్ర.. ఇప్పటికీ వీడని రహస్యాలు

కైలాస మానస సరోవర్ యాత్ర.. అందరికీ కాదు .. కేవలం సాహసికులకే సాధ్యపడే ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటిగా భావిస్తారు. వేలాది మంది యాత్రికులు ఎన్నో కష్టాలకు ఓర్చి  కైలాస పర్వతాన్నిచూడటానికి వెళ్తుంటారు.

కైలాస శిఖరం ఎత్తు ఎవరెస్ట్ కంటే చాలా తక్కువ. అయినప్పటికీ ఇప్పటివరకు కైలాసాన్ని అధిరోహించేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. దీనికి పర్వతంలోని అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, తీవ్రమైన వాతావరణం ప్రధాన కారణాలుగా చెబుతారు. అదే సమయంలో కైలాస పర్వతం చుట్టూ అనేక పురాణాలు, నమ్మకాలు, అంతుచిక్కని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

మిస్టరీగానే మిగిలిన కైలాస పర్వతం

కైలాస పర్వతంలో వాతావరణం గంట గంటకూ మారుతుందని అంటారు.  తీవ్రమైన చలి, మంచు, బలమైన గాలులు, నిటారు రాతి మార్గాలు యాత్రికులకు కానీ, పర్వతారోహకులకు కానీ కొత్త సవాళ్లు విసురుతాయి.

కైలాసానికి సంబంధించి విద్యుత్ అయస్కాంత శక్తులు, వింత భౌగోళిక లక్షణాలు ఉన్నాయనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. పర్వతంపై ఒక పరిధిని దాటిన తర్వాత ముందుకు వెళ్లడం సాధ్యం కాదని నమ్ముతారు. అక్కడ దాగి అదృశ్య శక్తి ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుందని కూడా చెబుతుంటారు. అయితే ఈ వాదనలకు  ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవు. కైలాస పర్వత రహస్యానికి పురాణాలు, విశ్వాసాలు, పర్వత భౌగోళిక వింతలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

ఎందుకు ఎవరూ ఎక్కలేదు?

కైలాస పర్వతం ఎవరెస్ట్ కంటే తక్కువ ఎత్తులో ఉన్నా, దాని నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. పర్వతం చుట్టూ నిటారుగా రాతి గోడలు, మంచుతో కప్పిన ప్రాంతాలు, ప్రమాదకర వాతావరణం అధిరోహణకు అనుకూలంగా ఉండవు. దీంతో పాటు హిందూ, బౌద్ధ, జైన, బోన్ సంప్రదాయాల్లో కైలాస పర్వతానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. అందువల్ల కైలాసాన్ని ఎక్కడం కంటే దాని చుట్టూ ప్రదక్షిణ చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు.  కైలాస పర్వతం చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాలు, భౌగోళిక సవాళ్లు ఇప్పటికీ మిస్టరీగా మిగిలాయి. అందుకే  ఈ పర్వతాన్ని ప్రపంచంలోని అత్యంత నిగూఢమైన పర్వతాల్లో ఒకటిగా నిలబెట్టాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us