Today Tirumala News: తిరుమలకు పోటెత్తిన భక్తజనం.. గోవింద నామస్మరణతో నూతన సంవత్సరానికి స్వాగతం..

Today Tirumala News: నూతన సంవత్సరం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున..

Today Tirumala News: తిరుమలకు పోటెత్తిన భక్తజనం.. గోవింద నామస్మరణతో నూతన సంవత్సరానికి స్వాగతం..

Updated on: Jan 01, 2021 | 7:03 AM

Today Tirumala News: నూతన సంవత్సరం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు క్యూలో నిల్చున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగాణం కిటకిటలాడుతోంది. గోవింద నామస్మరణతో తిరుమలగిరులు మారుమోగాయి. కాగా, నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు శ్రీవారి ఆలయం ముందు సంబరాలు చేసుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు.. గోవింద నామ స్మరణతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు.

ఆ దుష్ప్రచారాలను నమ్మకండి..
ఇదిలాఉండగా, శ్రీవారి ఆలయంపై శిలువ గుర్తు పెట్టారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తిరుమలపై దుష్ప్రచారం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే శ్రీవారి ఆలయంపై విద్యుత్ అలంకరణ తొలగించడంపై దుష్ప్రచారం చేయడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. ఇది సరైన పద్దతి కాదన్నారు. పోలీసులకు ఆధారాలు ఇవ్వడానికే శ్రీవారి ఆలయంపై పూర్ణకుంభం ఆకృతిని తొలగించి కొత్త అలంకరణ ఏర్పాటు చేశామని చెప్పారు. టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని భక్తులెవ్వరూ నమ్మకూడదని ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.

 

Also read:

Sensex: కరోనా కాలంలోనూ పెరిగిన పెట్టుబడిదారుల సంపదన… ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?

Rupee Gains: పెరిగిన రూపాయి విలువ… లాభపడింది ఎంతో తెలుసా..? పడిపోయిన డాలర్ విలువే కారణమా..?