
Shani remedies: హిందూ మతంలో పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత విశిష్టత ఉంది. అదే సమయంలో సనాతన ధర్మంలో దానధర్మాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దానధర్మాలతో పుణ్యం పొందడంతోపాటు అనేక కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. ఇక, మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాధాన్యత, విశిష్టత ఉంది. ఈ రోజు శని దోషాలను పోగొట్టుకునేందుకు పలు పరిహారాలున్నాయి. శని మహా ప్రభావాలను తగ్గించేందుకు జీవితంలో శాంతిని కొనసాగించేందుకు, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు మాఘ పూర్ణిమ నాడు దానాలు చేయడం తప్పనిసరి. ఈ దానాలు చేయడం వల్లో చెడు ఫలితాలు పోయి శుభాలు కలుగుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీని వచ్చే మాఘ పౌర్ణమి నాడు చేయాల్సిన దానాల గురించి తెలుసుకుందాం.
శని క్రూర ప్రభావం లేదా మహా దశ సమయంలో ఒక వ్యక్తి జీవితంలో ఇబ్బందులు పెరగడం ప్రారంభమవుతాయి. మనస్సు చంచలంగా ఉంటుంది. కష్టపడి పనిచేసినా పూర్తి ఫలితం లభించదు. మాఘ పౌర్ణమి నాడు తల స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయండి. ఈ దానం వల్ల మీ జీవితంలోని అన్ని ప్రతికూలతలు తొలిగిపోయి.. సానుకూల ఫలితాలు పొందుతారు.
మాఘ పౌర్ణమి నాడు హృదయపూర్వకంగా బెల్లం దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఈ దానం వల్ల గౌరవం లభిస్తుంది. అవమానాలు దూరమవుతాయి. శని మహాదశ ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. శరీరంలో శక్తి పునరుద్ధరించబడుతుంది. మనస్సులోని ఆందోళనలు తొలగిపోయి.. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మాఘ పౌర్ణమి నాడు ఆవ నూనెను పేదవారికి లేదా శని దేవుని ఆలయానికి దానం చేయడం వల్ల జీవితంలోని క్లిష్ట సమస్యలు పరిష్కారమవుతాయి. మీ జీవితంలో కొత్త ఉత్తేజం వస్తుంది. ఈ దానంతో మీ జీవితంలో సానుకూల పలితాలను పొందుతారు.
మాఘ పౌర్ణమినాడు ఈ మూడు దానాలు చేయడం వల్ల మీ జీవితంపై శని యొక్క క్రూరమైన చూపుల ప్రభావం తగ్గుతుంది. మీ ఆందోళనలు తగ్గుతాయి. మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రతికూలతలు తొలిగిపోయి సానుకూల ఫలితాలను పొందుతారు.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)