Holi 2024: మన దేశంలోనే కాదు.. పాకిస్తాన్ నుండి ఫిజీ వరకు అనేక దేశాల్లో హోలీ పండుగ జరుపుకుంటారని తెలుసా..

|

Mar 09, 2024 | 8:03 AM

ఈ హోలీ పండుగ సంబరాలు భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా దర్శనం ఇస్తాయి. భారతీయులు విదేశాలలోని ప్రజలు హోలీ పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు.  అంతేకాదు ప్రపంచంలో కొన్ని దేశాల్లో హోలీని భిన్నమైన సాంప్రదాయ రీతిలో జరుపుకుంటారు. అయితే అక్కడ హోలీని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. అయితే పేర్లు వేరుగా ఉన్నా.. పండగ జరుపుకునే పరమార్ధం ఒక్కటే.. 

Holi 2024: మన దేశంలోనే కాదు.. పాకిస్తాన్ నుండి ఫిజీ వరకు అనేక దేశాల్లో హోలీ పండుగ జరుపుకుంటారని తెలుసా..
Holi Celebrations
Follow us on

హోలీ పండుగ హిందూ మతానికి చాలా ముఖ్యమైన పండుగగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రజలు ఒకరిపై ఒకరిపై ఉన్న ద్వేషాన్ని మరచి రంగులతో సందడి చేస్తారు. ఇంకా చెప్పాలంటే పెద్దలు కూడా పిల్లలు గా మారి రంగులతో ఆడుకుంటారు. అయితే ఈ హోలీ పండుగ సంబరాలు భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా దర్శనం ఇస్తాయి. భారతీయులు విదేశాలలోని ప్రజలు హోలీ పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు.  అంతేకాదు ప్రపంచంలో కొన్ని దేశాల్లో హోలీని భిన్నమైన సాంప్రదాయ రీతిలో జరుపుకుంటారు. అయితే అక్కడ హోలీని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. అయితే పేర్లు వేరుగా ఉన్నా.. పండగ జరుపుకునే పరమార్ధం ఒక్కటే..

నేపాల్ లోని హోలీ

భారతదేశంలో హోలీకి ఎంత ప్రాముఖ్యత ఉందో నేపాల్‌లో కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. నేపాలీ భాషలో, అక్కడ ‘ఫాగు పున్హి’ పేరుతో హోలీని జరుపుకుంటారు. నేపాల్ జనాభాలో 80 శాతం మంది హిందువులు. నేపాల్‌లో హోలీని ఫాల్గుణ పూర్ణిమ అని కూడా అంటారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో హోలీని జరుపుకునే పద్ధతులు భిన్నంగా ఉన్నట్లే, నేపాల్‌లో కూడా హోలీ పండుగను వివిధ రకాలుగా జరుపుకుంటారు. నేపాలీలు కూడా హోలీ సందర్భంగా నీరు నింపిన బెలూన్‌లను ఒకరిపై ఒకరు విసురుకుంటారు, ఇది హోలీకి చెందిన చాలా ప్రసిద్ధ సంప్రదాయం. దీనిని “లోలా” అని పిలుస్తారు.

పాకిస్తాన్ లో హోలీ

1947లో భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయినప్పటికీ.. అక్కడి ప్రజలు ఇప్పటికీ భారతీయ పండుగలతో ముడిపడి ఉన్నారు. పాకిస్థాన్‌లో నివసిస్తున్న హిందువులు, ముస్లింలు కూడా హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. పాకిస్తాన్‌లో, భారతదేశం వలె  ఈ రంగుల పండుగను హోలీ పేరుతో జరుపుకుంటారు. అయితే హోలీ జరుపుకునే విధానం భారతదేశానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. పాకిస్తాన్‌లో హోలీ రోజున, పురుషులు ఓ కుండను పగలగొట్టడానికి పిరమిడ్‌ను నిర్మిస్తారు. అయితే ఈ పిరమిడ్‌ ని పగల గొట్టడంలో  పాల్గొనని వారు కుండను పగల కొట్టేవారిని ఆపడానికి ప్రయత్నిస్తారు. నీరు, వెన్న, పాలు, అనేక ఇతర ద్రవాలను విసురుతారు. శ్రీకృష్ణుడు వెన్న దొంగిలించకుండా ఆపే ఆచారంతో ఈ సంప్రదాయాన్ని ముడిపెట్టి జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

గయానాలో హోలీ

గయానా ప్రజలు హోలీని తమ ముఖ్యమైన పండుగగా భావిస్తారు. ఇక్కడ హోలీని “ఫాగ్వా” అనే పేరుతో జరుపుకుంటారు. గయానాలో హోలీకి చాలా ప్రాముఖ్యత ఉంది. భారతదేశం వలె హోలీ సందర్భంగా జాతీయ సెలవుదినం ఉంటుంది. గయానాలో ప్రధాన వేడుక ప్రసాద్ నగర్ ఆలయంలో జరుగుతుంది. ఇక్కడ ప్రజలు రంగులు, నీటితో హోలీ ఆడటానికి ..  ఈ ప్రత్యేక రోజును ఆస్వాదించడానికి కలిసి వస్తారు.

ఫిజీ లో హోలీ

ఫిజీలో కూడా, ఈ పండుగను భారతదేశంలో వలె హోలీ పేరుతో జరుపుకుంటారు. అయితే హోలీని జరుపుకునే విధానం కొంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ భారతీయ మూలాల నివాసితులు హోలీని జానపద పాటలు, జానపద నృత్యాలతో రంగుల పండుగగా జరుపుకుంటారు. ఈ కాలంలో ఫిజీలో పాడే జానపద పాటలను ఫాగ్ సింగింగ్ అంటారు. ఫిజీలో ఈ పండుగ సందర్భంగా పాడిన పాటలు శ్రీ కృష్ణుడు, రాధా రాణి  ప్రేమ.. బంధం ఆధారంగా ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..