Brundavan: ఆ ఆలయంలో రాత్రివేళ శివుడికి స్త్రీగా అలంకారం..5300 ఏళ్ల నుంచి భర్త కోసం బయట వేచి ఉన్న పార్వతి దేవి..

|

Jul 25, 2024 | 5:35 PM

శ్రావణ మాసంలో శివ భక్తులు ముఖ్యంగా ఉత్తరాదివారు శివుడిని ఆరాధిస్తారు. శివాలయానికి వెళ్లి శివుడిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ప్రతి శివాలయంలో గర్భగుడిలో, మధ్యలో శివలింగం ఉండగా.. శివయ్యకు ఎదురుగా నంది.. ఉండగా ఇక పార్వతి దేవి, గణపతి, కార్తికేయుడు ఇతర దేవాలయాలుగా ఉంటాయి. అయితే ప్రపంచంలో ఒక శివాలయం వెరీ వెరీ స్పెషల్. ఇక్కడ శివాలయంలోని గర్భగుడిలో శివయ్య ఉండగా పార్వతి దేవి అతనికి ఎదురుగా అంటే శివాలయం తలుపు దగ్గర శివయ్య కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ ఆలయం ఉత్తర ప్రదేశ్ లోని బృందావన్‌లో ఉంది.

1 / 8

ఈ ఆలయంలో ద్వాపర యుగంలో అంటే సుమారు 5300 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చెబుతారు. ఈ ప్రసిద్ధ దేవాలయం గోపేశ్వర మహాదేవ ఆలయం. శ్రీమద్ భగవత్ మహాపురాణంలో ఈ దేవాలయం, గోపేశ్వర మహాదేవ్ మహిమ గురించి ప్రస్తావన ఉంది. ఈ పురాణ గ్రంథంలో బృందావన్‌లో స్థాపించబడిన ఈ ఆలయం శ్రీకృష్ణుడు ఉన్న ద్వారప యుగానికి చెందినదని స్పష్టంగా చెప్పబడింది. మహర్షుల దర్శనానికి శివుడు ఇక్కడికి వచ్చాడు.

2 / 8
పరమశివుడు కైలాసంలో ధ్యానం చేస్తుండగా బృందావనంలో శ్రీ కృష్ణుడి వేణు నాదం విని మంత్రముగ్గులై కైలాసం వదలి బృందావనంలోని శ్రీ కృష్ణుడి రాసలీలను తిలకించడానికై వచ్చాడు. అప్పుడు కృష్ణుడు ఒక్కడే.. లక్షలాది మంది గోపికలు ఉన్నారు. తనకు కూడా రసలీలలో పాల్గొనాలనే కోరిక శివయ్యకు కలిగింది. దీంతో శివుడు కూడా మహారాసులోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు.

3 / 8
అయితే గోపికలు అతన్ని తలుపు వద్ద ఆపారు. ఆ సమయంలో ఒక గోపిక సలహా మేరకు శివుడు స్త్రీ రూపాన్ని ధరించి చీర ధరించి, పెద్ద ముక్కుపుడక, చెవులకు పోగులు ధరించి 16 అలంకారాలతో అందమైన యువతిగా మారి మహారాస్‌లో పాల్గొనడానికి వచ్చాడు.

4 / 8
భర్త కోసం బృందావనానికి చేరుకున్న పార్వతి దేవి.. శ్రీమద్ భగవత్ మహాపురాణం ప్రకారం.. అయితే వేణుగానం విన్న శివుడు పార్వతి దేవి చెప్పకుండా బృందావనానికి చేరుకున్నాడు. ఇలా శివుడు తల్లి పార్వతికి తెలియజేయకుండా మొదటిసారి కైలాసం నుండి బయటకు వచ్చాడు.

5 / 8
ఈ విషయం తెలిసిన వెంటనే పార్వతి దేవి కూడా శివుడిని అనుసరించి బృందావనానికి చేరుకుంది. అక్కడ శివుడు గోపికగా మారి శ్రీకృష్ణుడితో కలిసి నాట్యం చేస్తూ కనిపించాడు.

6 / 8
 అది చూసి పార్వతీదేవి కూడా పరవశించిపోయింది. తాను కూడా వెళ్లి మహారాస్‌లో చేరాలి అని కూడా అనుకుంది. అయితే శివుడు బృందావనంలోకి వెళ్లి పురుషుడి నుండి స్త్రీగా మారారని.. తను అక్కడకు వెళ్తే.. స్త్రీ నుండి మగవాడిగా మారితే ఏమి జరుగుతుందో అని భయపడింది.

7 / 8

గర్భగుడి బయట భర్త కోసం వేచి ఉన్న పార్వతీదేవి..  అని ఆలోచిస్తూ పార్వతి దేవి తలుపు బయట కూర్చుని.. శివుడిని బయటకు రమ్మనమని సైగలు చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో గోపిక స్థానంలో ఈశ్వరడు వచ్చి నాట్యం చేయడం వల్ల శ్రీకృష్ణుడు శివుడికి గోపేశ్వర అని పేరు పెట్టారు. తల్లి పార్వతి గర్భగుడి వెలుపల భర్త కోసం వేచి ఉంది. నేటికీ ఈ కారణం చేతనే ఇక్కడి దేవాలయంలోని శివలింగానికి రాత్రి వేళ స్త్రీ అలంకారం చేస్తారు.

8 / 8
ముఖ్యంగా శరద్ పూర్ణిమ రాత్రి శివయ్యను అందమైన స్త్రీ రూపంలో అలంకరిస్తారు. ఈ సమయంలో శివయ్యను దర్శించుకుని అనుగ్రహం పొందడానికి భారీ సంఖ్యలో భక్తులు గోపేశ్వర మహాదేవ ఆలయానికి చేరుకుంటారు.