చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి చాలు

సాధారణంగా కోపం అందరికీ వస్తుంది. అయితే, అది పరిస్థితుల తీవ్రతను బట్టి ఉంటుంది. కానీ, కొందరికి మాత్రం చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. దీంతో ఇతరుపై ఎప్పుడూ మండిపడుతూ ఉంటారు. ఇది వారితోపాటు ఇతరులకు హాని కలిగిస్తుంది. అయితే, ఈ కోపం స్వభావానికి ఓ గ్రహ బలహీనతే కారణమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి చాలు
Angry Bhudagrah

Updated on: Jan 12, 2026 | 12:42 PM

కోపం అనేది మానవ సహజ గుణం. అయితే, అవసరం ఉన్నప్పుడు వస్తేనే దానికి విలువ ఉంటుంది. కానీ, కొంతమంది చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఆగ్రహానికి గురవుతుంటారు. తరచూ కోపం వస్తుంటే అది అతనితోపాటు ఇతరులకు కూడా హాని చేస్తుంది. అయితే, వ్యక్తులు ఇలా తరచూ కోపంగా ఉండటానికి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని కారణాలున్నాయి. జ్యోతిష్య శాస్త్రం తొమ్మిది గ్రహాలను వివరిస్తుంది. గ్రహాలు ఒక వ్యక్తి వ్యక్తిత్వంపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపుతాయని చెబుతోంది.

చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం జాతకంలో బలహీనమైన గ్రహానికి సంకేతమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. కాబట్టి, ఇది ఏ గ్రహం, జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తి త్వరగా కోపం ఎందుకు తెచ్చుకుంటాడో తెలుసుకుందాం.

బుధుడు బలహీనంగా ఉన్నాడనడానికి సంకేతాలు

జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాలకు రాకుమారుడిగా పరిగణిస్తారు. బుధుడిని తెలివితేటలు, తర్కం, కమ్యూనికేషన్, వ్యాపారం, గణితం, రచన, చర్మానికి కారకమని పండితులు చెబతారు. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్న వ్యక్తి తరచుగా చిన్న విషయాలకు కూడా వాదించుకుంటాడు, కోపాన్ని నియంత్రించుకోవడంలో ఇబ్బంది పడతాడు. తమను తాము స్పష్టంగా వ్యక్తపరచలేడు.

అంతేగాక, బుధుడు బలహీనంగా ఉన్న వ్యక్తి తరచుగా విషయాలను మర్చిపోతుంటారు. గుర్తుంచుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బుధుడు బలహీనంగా ఉంటే పిల్లలు పుట్టడం వల్ల కలిగే ఆనందానికి ఆటకం కలుగుతుంది. బుధుడు ఇంటికి, పనికి మాత్రమే కాదు.. వ్యక్తి ప్రవర్తన, సామాజిక దృక్పథాన్ని కూడా ప్రభావితం చేస్తాడు. అమ్మాయిల పట్ల గౌరవం, ఇతరులతో సంబంధాలు అన్నీ కూడా బుధుడిచే ప్రభావితం అవుతాయి.

బుధుడిని బలోపేతం చేయండి ఇలా

మీ జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే.. మీరు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదువుకోవడం, నేర్చుకునే అలవాటును పెంపొందించుకోవాలి. పిల్లలకు ఇతరులను గౌరవించడం నేర్పించాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. భావోద్వేగాలను ప్రశాంతంగా ఉంచుకోవాలి.

కనీసం 27 బుధవారాలు ఉపవాసం ఉండాలి. గణేశుడిని పూజించండి. బుధవారం తులసి ఆకులు తినాలి. ఆకుపచ్చ వస్తువులు దానం చేయండి. ఆవులకు పచ్చని మేత తినిపించిండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో బుధుడు బలపడే అవకాశం ఉంది. దీంతో మీకున్న కోపం స్వభావంలో మార్పులు రావచ్చు.

Note: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9 ధృవీకరించదు.