దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాల సందడే కనిపిస్తుంది. వీధిన కొలువుదీరిన గణనాధులు భక్తుల విశేష పూజలందుకుంటున్నారు. విభిన్న రూపాల్లో కొలువైన వినాయకులను చూసేందుకు ప్రజలు కూడా భారీగా తరలివస్తున్నారు. ఈ యేడు వినూత్నంగా చంద్రయాన్-3, వందేభారత్ వంటి రూపాల్లో దర్శనమిస్తున్న వినాయకుడు భక్తులను విస్మయానికి గురిచేస్తున్నాడు., విశ్వాసం, ఐశ్వర్యం, విస్మయపరిచే హస్తళా నైపుణ్య ప్రదర్శనలో వినాయక చవితి సందర్భంగా మహారాష్ట్రలో కొలువుదీరిన వినాయకులు ముందుంటున్నారు. బుల్దానా జిల్లాలో ఒక స్వర్ణకారుడు 105 కిలోల స్వచ్ఛమైన వెండిని ఉపయోగించి అద్భుతమైన గణేశ విగ్రహాన్ని సృష్టించాడు. ప్రఖ్యాత నగల వ్యాపారి కమల్ జహంగీర్.. స్థానిక గణేష్ మండల్ (కమ్యూనిటీ గ్రూప్) కోసం ఈ అసాధారణమైన గణేశ విగ్రహాన్ని రూపొందించారు. అంతేకాదు.. ఈ విగ్రహం ధగధగ లాడే వజ్రాలతో అలంకరించారు. గణేశుడు తన చేతుల్లో త్రిశూలం, గండ్ర గొడ్డలి, మోదకం పట్టుకొని ఉన్నాడు. ఒక చేతిపై అద్భుతంగా తీర్చిదిద్దిన పవిత్రమైన “ఓం” చిహ్నం ద్వారా దైవిక ప్రకాశం వెదజల్లుతున్నాడు.
ఈ విగ్రహానికి సంబంధించి గత మూడు నెలలుగా నిరంతరాయంగా నిర్మాణ పనులు కొనసాగించారు. చివరకు చవితి నాటికి విగ్రహం తయారీ పూర్తైనట్టుగా జహంగీర్ వెల్లడించారు. 105 కిలోల వెండితో రూపొందించిన విస్మయం కలిగించే గణేశ విగ్రహం విలువ 9 మిలియన్ రూపాయలు (90 లక్షల రూపాయలు) ఉంటుందని అంచనా.
గణేష్ పండుగ సందర్భంగా సెప్టెంబర్ 18న జల్నాలోని ప్రత్యేక గణేష్ మండల్ సభ్యులు ఈ అద్భుతమైన వినాయక సృష్టిని భారీ ఊరేగింపులో తీసుకువెళ్లారు. ఉత్సవాల తరువాత ఈ ప్రత్యేక విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించనున్నట్టుగా ఉత్సవ కమిటీ ప్రకటించింది.
మరోవైపు, ముంబై నగరంలోని అత్యంత సంపన్నమైన గణపతి మండపాలలో ఒకటిగా పేరుగాంచింది గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) కమిటీ. వీరు 69వ గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా అద్భుతమైన బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించబడిన ప్రకాశవంతంగా ఉన్న గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టాంరు.
#WATCH | Maharashtra | ‘Richest’ Ganpati of Mumbai – by GSB Seva Mandal – installed for the festival of #GaneshChaturthi.
The idol has been adorned with 69 kg of gold and 336 kg of silver this year. pic.twitter.com/hR07MGtNO6
— ANI (@ANI) September 18, 2023
ఈ విగ్రహంలో 69 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. అత్యంత ధనవంతుడైన ఇక్కడి గణనాధుడిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. మిరుమిట్లు గొలిపే కాంతులతో ఇక్కడి వినాయక విగ్రహ దృశ్యం చూపరులను విస్మయానికి గురి చేసింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..