Lord Shiva: భోలాశంకుడికి కోపం కూడా ఎక్కువే.. సూర్యుడిపై దాడి చేసిన శివయ్య.. శాపానికి కూడా గురయ్యాడని తెలుసా..

|

Feb 26, 2024 | 7:52 AM

బ్రహ్మ వైవర్త పురాణంలో తీవ్రమైన శారీరక నొప్పితో బాధపడుతున్న మాలి , సుమాలి అనే రాక్షసులు ..  సూర్య భగవానుడి కారణంగా వారు దాని నుండి విముక్తి పొందలేకపోయారని పేర్కొన్నారు. ఇద్దరూ శివుని శరణువేడాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ తమ బాధను శివునికి తెలియజేసి, తాము కోలుకోకపోవడానికి గల కారణాన్ని సూర్యభగవానునికి చెప్పారు. మాలి, సుమాలి కష్టాలను విన్న శివుడు కలత చెందాడు.. అంతేకాదు తీవ్ర ఆగ్రహంతో వెంటనే త్రిశూలంతో సూర్యభగవానుడిపై దాడి చేశాడు.

Lord Shiva: భోలాశంకుడికి కోపం కూడా ఎక్కువే.. సూర్యుడిపై దాడి చేసిన శివయ్య.. శాపానికి కూడా గురయ్యాడని తెలుసా..
Lord Shiva
Follow us on

హిందూ మతంలో శివుడిని సృష్టి లయకారుడు అని అంటారు. భోలాశంకరుడు తనని నమ్మి పూజించే భక్తులను రక్షిస్తాడని.. మొర వింటాడని నమ్ముతారు. జలంతో అభిషేకం చేస్తే చాలు కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు. అటువంటి శివుడికి కూడా కోపం వస్తే త్రినేత్రాన్ని ఉపయోగిస్తాడు. దేవతలనైనా సరే భస్మం చేస్తాడు. వరాలను ఇచ్చే భోళాశంకరుడు తన భక్తుల రక్షణ కోసం దేవతలను సైతం శపించిన సంఘటలు ఉన్నాయి. పురాణాల ప్రకారం లోకానికి వెలుగుని జీవరాశికి చైతన్యాన్ని ప్రసాదించే సూర్యుడు కూడా శివయ్య కోపానికి గురయ్యాడు. శివుడితో వరం పొందిన తన మాలి, సుమాలి అనే రాక్షసులు వలన సూర్యుడు..  శివుడు కోపానికి గురయ్యాడు. శివుడు తన ఆయుధమైన త్రిశూలంతో సూర్య భగవానుడిపై దాడి చేసాడు.. దీని  కారణంగా మొత్తం సృష్టి చీకటిగా మారింది. ఆ సంఘటన ఏమిటి..  దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

పౌరాణిక కథ ఏమిటంటే..

బ్రహ్మ వైవర్త పురాణంలో తీవ్రమైన శారీరక నొప్పితో బాధపడుతున్న మాలి , సుమాలి అనే రాక్షసులు ..  సూర్య భగవానుడి కారణంగా వారు దాని నుండి విముక్తి పొందలేకపోయారని పేర్కొన్నారు. ఇద్దరూ శివుని శరణువేడాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ తమ బాధను శివునికి తెలియజేసి, తాము కోలుకోకపోవడానికి గల కారణాన్ని సూర్యభగవానునికి చెప్పారు. మాలి, సుమాలి కష్టాలను విన్న శివుడు కలత చెందాడు.. అంతేకాదు తీవ్ర ఆగ్రహంతో వెంటనే త్రిశూలంతో సూర్యభగవానుడిపై దాడి చేశాడు.

శివుని దాడి చేస్తే ఎవరు ఎదురు వెళ్లగలరు

త్రిశూలంతో శివుడు చేసిన దాడి కారణంగా సూర్య భగవానుడు స్పృహ కోల్పోయి తన రథం నుండి కింద పడిపోయాడు. దీంతో సృష్టి మొత్తం చీకటిగా మారింది. సూర్యభగవానుడు కశ్యపు మహర్షి కుమారుడు. విశ్వంలోని అంధకారం మారింది. శివుడు తన కుమారుడు సూర్యుడిపై చేసిన దాడి గురించి కశ్యప మహ ఋషికి తెలిసింది. దీంతో కశ్యపు మహాఋషి తన కుమారుడి పరిస్థితి చూసి దుఃఖించాడు. శివుడి చేసిన పనికి కోపంతో శివుడిని శపించాడు. నీ చేతులతోనే నువ్వు నీ కుమారుడి మరణానికి కారణం అవుతావని శాపం ఇచ్చాడు. ఈ శాపం కారణంగానే శివుడు గణేశుని తల నరికి చంపాడని పురాణాల కథనం..

ఇవి కూడా చదవండి

సూర్య భగవానుడికి ప్రాణం పోసిన బ్రహ్మ

శివుని కోపం చల్లారగానే విశ్వం అంధకారంలో ఉండడం చూశాడు. అప్పుడు శివుడి ప్రార్థనతో బ్రహ్మ సూర్య భగవానుడికి మళ్ళీ జన్మనిచ్చాడు. సూర్య దేవుడు స్పృహలోకి వచ్చిన అనంతరం తన తండ్రి శాపం గురించి తెలుసుకున్నాడు. విచారించాడు. అయినా ఏది జరిగినా లోక కళ్యాణార్థమే అంటూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కశ్యప్ ఋషిని ఆశీర్వదించారు. మళ్ళీ సూర్యభగవానుడు తన రథాన్ని ఎక్కి విధులను నిర్వహిస్తూ విశ్వానికి వెలుగు ఇవ్వడం ప్రారంభించాడు.

సూర్య భగవానుని ఆరాధన

అదే సమయంలో ఆరోగ్య కోసం సూర్యనారాయుడి పూజ ఎందుకు శ్రేష్టమో బ్రహ్మ .. రాక్షుసులైన మాలి, సుమాలి బ్రహ్మ వివరించాడు. అప్పుడు బ్రహ్మదేవుని సూచనల మేరకు మాలి-సుమాలి సూర్యభగవానుని ఆరాధించారు. వారి పూజకు సంతసించిన సూర్యభగవానుడు వారి శారీరక సమస్యలని తీర్చి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు