Swapana Shastra: కలలో బంగారు నగలు కనిపించాయా.. ఆ కలకు ప్రత్యేక అర్ధం.. శుభమా.. అశుభమా.. తెలుసుకోండి..

Updated on: Mar 11, 2025 | 6:16 PM

నిద్రలో కలలు రావడం సర్వ సాధారణం. ఈ కలలు అనేక రకాలుగా ఉంటాయి. కొంత మందికి కలలో పక్షులు, జంతువులు, దేవుళ్ళు వంటివి కనిపిస్తే.. మరోకొందరి కలలో రకరకాల వస్తువులు కనిపిస్తాయి. అలా మీ కలలో బంగారు ఆభరణాలు కనిపిస్తే.. అలా వచ్చే కలలకు వివిధ అర్థాలు కూడా ఉన్నాయి. ఈ రోజు బంగారు ఆభరణాలకు సంబంధించిన వివిధ రకాల కలల అర్థాలను గురించి తెలుసుకుందాం.

1 / 6
కలలకు అనేక అర్థాలు ఉన్నాయి. కొన్ని కలలు భవిష్యత్తులో జరిగే సంఘటనలకు ముందస్తు సూచనగా ఉంటాయని స్వప్న శాస్త్రంలో పేర్కొంది. కలల్లో ఒకరి బంగారు ఆభరణాలు కనిపిస్తే కూడా ఆ కలలకు రకరకాల అర్ధాలున్నాయి. బంగారు ఆభరణాలు కలలో కనిపిస్తే వాటి అర్థం.. ఈ రకమైన కలలకు రావడానికి గల కారణమేమిటో తెలుసుకుందాం.. కలలో బంగారు ఆభరణాలు కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీనిని అనేక రూపాలుగా తీసుకోవచ్చట. నేలపై పడి ఉన్న నగలు గురించి కలలు కన్నా లేదా నగలు కొని ధరించినట్లు కలలు కన్నా.. ఈ కలలకు అనేక అర్థాలు ఉన్నాయని స్వప్న శాస్త్రంలో పేర్కొంది.

2 / 6
నేలపై పడి ఉన్న బంగారు ఆభరణాలు: ఎవరి కలలోనైనా నేలపై పడి ఉన్న బంగారు ఆభరణాలు కనిపిస్తే.. ఆ కలకు అర్ధం.. మీ జీవితంలో ఆర్థిక నష్టాలు రానున్నాయని ముందస్తు సూచన కావచ్చు. అంతేకాదు మీ కుటుంబంలో ఆర్థిక పతనాన్ని కూడా ఈ కల సూచిస్తుంది. మీకు ఇలాంటి కలలు వస్తుంటే.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బులు ఖర్చు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బును వృధాగా ఖర్చు చేయకుండా.. అదుపుగా ఉండాలట.

3 / 6
బంగారు నగలు కొంటున్నట్లు కలగంటే: ఎవరైనా బంగారు ఆభరణాలు కొనాలని కలలుకంటున్నట్లయినా, కొనాలనుకున్నట్లు భావిస్తున్నా అది మీకు శుభసూచకం.  స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కల వస్తే.. త్వరలో అదృష్టం మీ సొంతం అవుతుందని అర్ధం. దీనితో పాటు జీవితంలో గొప్ప విజయం సాధించానున్నారని అర్ధమట.

4 / 6
బంగారు ఆభరణాలు ధరిస్తున్నట్లు కలలు కనడం: కలలో బంగారు ఆభరణాలు ధరించి ఉన్నట్లు కల కన్నా... బంగారు ఆభరణాలు ధరిస్తున్నట్లు కల కంటే అది మీకు అశుభానికి సంకేతం. ఇలాంటి కలలు రానున్న కాలంలో మీ దగ్గరి బంధువులలో ఒకరి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని చెడు వార్తలు వినే అవకాశం ఉందని ముందస్తు సూచన. కనుక ఇటువంటి కలలు వస్తే.. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.  ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

5 / 6
బంగారు నగల చోరీ: మీ కలలో బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్నట్లు కనిపిస్తే ఆ కల అశుభ కల. అటువంటి కల మంచిది కాదు. వ్యాపారస్తులు తీవ్ర నష్టాల బారిన పడవచ్చు. ఉద్యోగస్తులు తమ తోటి ఉద్యోగస్తుల చేతిలో మోస పోయే అవకాశం ఉంది. డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది.

6 / 6
 
గోల్డ్ ని గిఫ్ట్ గా ఇస్తుంటే.. ఎవరి కలలోనైనా బంగారు ఆభరణాలను బహుమతిగా ఇస్తున్నట్లు .. లేదా బహుమతిని తీసుకున్నట్లు వస్తే.. ఆ కల శుభ కలగా స్వప్న శాస్త్రం పేర్కొంది. అంతేకాదు మీరు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వారు విజయాన్ని సొంతం చేసుకుంటారని అర్ధమట.