స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతీ కలకి ఒక అర్థం ఉంటుంది. అయితే దేవుళ్ళు, దేవతలు కలలో కనిపించడం బహు అరుదు.. అయితే దుర్గాదేవి లేదా అమ్మావారికి సంబంధించిన ఏదైనా ప్రత్యేక కల వస్తే దానికి కూడా అర్ధం ఉందని స్వప్న శాస్త్రంలో పేర్కొంది. అమ్మవారు కొన్న సందర్భాల్లో ముఖ్యంగా చైత్ర మాసంలో నవరత్రుల్లో, శరన్నవరాత్రుల్లో భూమి మీద సంచరిస్తుందని.. భక్తులకు ఆనందం, శ్రేయస్సును ప్రసాదిస్తుందని మత విశ్వాసం ఉంది. అటువంటి పరిస్థితిలో అమ్మవారికి సంబంధించిన కొన్ని కలలు వచ్చినట్లు అయితే అమ్మవారి ఆశీస్సులు మీపై కురుస్తున్నాయని అర్థం చేసుకోవాలట. అమ్మవారికి సంబంధించిన కలలు దేనిని సూచిస్తాయో స్వప్న శాస్త్రం ప్రకారం తెలుసుకుందాం.
కలలో దుర్గాదేవి కనిపిస్తే: స్వప్న శాస్త్రం ప్రకారం.. చైత్ర నవరాత్రులలో దుర్గాదేవి మీ కలలో కనిపిస్తే.. మీ జీవితమంతా విజయవంతమైందని అర్థం. దుర్గాదేవి కలలో కనిపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మీ జీవితంలోని బాధలన్నీ ముగిసి, ఆనందం రాబోతోందని ఈ కలకు అర్ధం అని స్వప్న శాస్త్రం పేర్కొంది.
కలలో సింహంపై స్వారీ చేస్తున్న అమ్మవారు కనిపిస్తే: చైత్ర నవరాత్రులలో దుర్గాదేవి సింహంపై స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తే, అలాంటి కల చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కలకు అర్ధం ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయని అర్ధమట. అంతేకాదు ఇలాంటి కలకు అర్ధం త్వరలో మీ శత్రువులపై విజయం సాధిస్తారని సూచిస్తుందట.
కలలో అమ్మవారి ఆలయం: కలలో దుర్గాదేవి ఆలయం కనుక కనిపిస్తే ఆ కల శుభప్రదమైన కల అని, కుబేరుడు మీపై ప్రత్యేక ఆశీస్సులు కురిపించనున్నాడని అర్థం. అలాగే ఈ సమయంలో కలలో అమ్మవారి ఆలయాన్ని చూడటం వలన డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని, ఆర్థిక ప్రయోజనాలను పొందనున్నారని ఈ కల సూచిస్తుందట.
కలలో అమ్మవారి వాహనం సింహం కనిపిస్తే: ఈ చైత్ర నవరాత్రులలో కలలో సింహాన్ని చూడటం చాలా శుభప్రదం. సింహాన్ని దుర్గాదేవి వాహనంగా పరిగణిస్తారు. కనుక కలలో సింహం కనిపిస్తే దుర్గాదేవి ఆశీర్వాదం, అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుందని అర్ధమట. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో సింహాన్ని చూడటం అంటే జీవితంలో రానున్న అదృష్టం గురించి మాత్రమే కాదు.. అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని సూచిస్తుందట.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు