Diwali 2021: దీపావళి వేడుకలకు దేశ వ్యాప్తంగా ఆలయాలు రెడి అవుతున్నాయి. దీపావళి పండగ సందర్భంగా విష్ణు మూర్తి కొలువైన బద్రీనాథ్ ఆలయం అందంగా ముస్తాబైంది. అందమైన రంగురంగుల పూలతో అలంకరించారు. బద్రీనాథ్ ఆలయ అందాలు కనుచూపు మేరలో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీపావళి సందర్భంగా బద్రీనాథ్ ధామ్‌లో వేడుకలకు ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు. బద్రీనాథ్ ఆలయాన్ని దాదాపు 10 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. దీపావళి సందర్భంగా, బద్రీనాథ్ ఆలయంలో కుబేరుడు, లక్ష్మి దేవికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేథార్ నాథ్ .. ఈ నాలుగు ధామ్‌లను దర్శనం కోసం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు చేరుకుంటున్నారు. వైష్ణవ 108 దివ్య క్షేత్రాల్లో బద్రీనాథ్ ఆలయం ఒకటి. ఇక్కడ విష్ణు మూర్తి అక్కడ బద్రినాథుడిగా భక్తులతో పూజలను అందుకుంటాడు. ఇటీవల ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి బద్రీనాథ్ ను దర్శించుకున్నారు. వివిధ పూజల్లో పాల్గొన్నారు.
#WATCH | Uttarakhand: Badrinath Temple decorated with 10 quintals of flowers on the occasion of #Diwali2021 pic.twitter.com/IgHzXSAE88
— ANI (@ANI) November 3, 2021
శీతాకాలం సందర్భంగా బద్రీనాథ్ ఆలయం తలపులు నవంబర్ 20 వ తేదీ సాయంత్రం 6.45 గంటలకు మూసివేయనున్నారు. బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసివేసే తేదీని దసరా రోజున ప్రకటించారు. ఇక నవంబర్ 6న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మూసివేయబడతాయి. నవంబర్ 6న యమునోత్రి ధామ్ తలుపులు కూడా మూసివేయబడతాయి. అంతేకాదు నవంబర్ 5న గోవర్ధన్ పూజ సందర్భంగా గంగోత్రి ధామ్ తలుపులు మూసివేయనున్నారు.
Also Read: నేడు సరయూ నదీ తీరంలో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన అయోధ్య .. అన్ని ఏర్పాట్లు పూర్తి