Dhanurmasa Special: నేడు ధనుర్మాసంలో 28వ రోజు.. ఇవాళ్టి పాశురంలో శ్రీకృష్ణుడిని శరణాగతి కోరుతున్న గోపికలు..

|

Jan 12, 2022 | 7:41 AM

Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు ఇరవై ఎనిమిదవ రోజు.. అమ్మాళ్ రంగనాధుడిని తన భర్తగా పొందడానికి ఈ మాసంలో (Dhanurmasa) వ్రతమాచరిస్తూ.. పాశురాలను రచించింది. ఈ పాశురాలను..

Dhanurmasa Special: నేడు ధనుర్మాసంలో 28వ రోజు.. ఇవాళ్టి పాశురంలో శ్రీకృష్ణుడిని శరణాగతి కోరుతున్న గోపికలు..
Dhanurmasa 27th Day
Follow us on

Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు ఇరవై ఎనిమిదవ రోజు.. అమ్మాళ్ రంగనాధుడిని తన భర్తగా పొందడానికి ఈ మాసంలో (Dhanurmasa) వ్రతమాచరిస్తూ.. పాశురాలను రచించింది. ఈ పాశురాలను తిరుప్పావై (Tiruppavai) అని అంటారు. ఈ రోజు తిరుప్పావై 28 వ పాశురం (pashuram). ఈ పాశురాల్లో 20వ పాశురం నుంచి 29వ పాశురం వరకూ గోదాదేవి శ్రీకృష్ణ భగవానుడిని వర్ణిస్తుంది. నేటి  పాశురంలో శ్రీకృష్ణుడిని శరణగతి కోరుతూ.. గోదాదేవి గోపికలతో వేడుకుంది. ఈరోజు ధనుర్మాసంలో 28 వ పాశుర‌ము, దాని అర్ధం తెలుసుకుందాం.

28.పాశురము

క ఱవైగళ్ పిన్ శెన్రు క్కానమ్ శేర్ న్దుణ్బోమ్,
అఱివొన్రు మిల్లాద వాయ్ క్కులత్తు ఉన్దన్నై
ప్పిఱవి పె ఱున్దనై పుణ్ణియమ్ నాముడైయోమ్
కు ఱైవొన్రు మిల్లాద గోవిన్దా !ఉన్దన్నోడు
ఉఱవేల్ నమక్కి ఙ్గొళిక్క వొళియాదు
అఱియాద పిళ్ళైగళోమ్, అన్బినాల్ ఉన్దన్నై
చిఱుపేరళైత్తనవుమ్ శీఱి యరుళాదే
ఇఱైవా నీ తారాయ్ పఱైయేలో రెమ్బావాయ్.

అర్ధం: ఓ కృష్ణా ! మేము అవివేక శిఖామణులం .. తెల్లవారగానే చద్ది తిని పశువుల వెంట అడవికిపోయి , పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరతాము. వివేకం లేని వారం, అజ్ఞానులం. గొల్లపడుచులం. నీవు మా గొల్లకులంలో జన్మించటయే మాకు మహాభాగ్యం. నీతోడి సహవాసమే మాకదృష్టం. ఈ బంధమెన్నటికినీ తెగనిది. త్రెంచిలేనిది. అందుకే మా గోపికాకులం ధన్యమైంది. పరిపూర్ణ కళ్యాణగుణగుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడువు. మాకు లోక మర్యాద ఏ మాత్రం తెలియక నిన్ను.. చిన్నచిన్న పేర్లతో కృష్ణా, గోవిందా అంటూ పిలిచాము. కృష్ణా అలా నిన్ని పిలిచినందుకు కోపగించుకోకు. జ్ఞానులు పొందవలసిన ఆ పద వాద్యమును యీ కారణమున మాకు యివ్వనబోకుము. నీతో మెలిగిన సఖులమని భావించి మాపై కృప చూపించు…అని గోపికలందరూ స్వామికి శరణాగతిని కోరారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తిచేసే విధంగా ఆశీర్వదించుమని.. తమ తప్పులను భరించి.. తమను క్షమించమని గోదాదేవి గోపికలతో పాటు శ్రీ కృష్ణుడిని కోరారు.

 

Also Read:

ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు.. నేడు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మొక్కలను నాటడానికి వాస్తు నియమాలు ఉన్నాయి.. అవేంటో తెలుసుకోండి..