Dhanurmasa Special: నేడు ధనుర్మాసంలో 26వ రోజు.. శ్రీకృష్ణుడిని తమ కోర్కెలు తీర్ప కృపజూపని అడుగుతున్న గోదా, గోపికలు..

|

Jan 10, 2022 | 8:13 AM

Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు ఇరవైఆరవ రోజు. ఈ మాసంలో అమ్మాళ్ రంగనాధుడిని తన భర్తగా పొందడానికి వ్రతమాచరిస్తూ.. పాశురాలను రచించింది. ఈ పాశురాలను తిరుప్పావై

Dhanurmasa Special: నేడు ధనుర్మాసంలో 26వ రోజు.. శ్రీకృష్ణుడిని తమ కోర్కెలు తీర్ప కృపజూపని అడుగుతున్న గోదా, గోపికలు..
Thiruppavai Pasuram
Follow us on

Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు ఇరవైఆరవ రోజు. ఈ మాసంలో అమ్మాళ్ రంగనాధుడిని తన భర్తగా పొందడానికి వ్రతమాచరిస్తూ.. పాశురాలను రచించింది. ఈ పాశురాలను తిరుప్పావై అని అంటారు. ఈ రోజు తిరుప్పావై 26వ పాశురం. ఈ పాశురాల్లో 2వ పాశురం నుంచి 29వ పాశురం వరకూ గోదాదేవి భగవద్విభూతిని వర్ణిస్తుంది. నేడు 26వ పాశురంలో శ్రీకృష్ణుడు పై అనుగ్రహం చూపని గోదాదేవి తన చెలులతో కలిసి ప్రార్ధించింది. ఈరోజు ధనుర్మాసంలో 26వ రోజు ..ఈరోజు  పాశుర‌ము, దాని అర్ధం తెలుసుకుందాం..

తిరుప్పావై..26వ పాశురం: 

మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్
మేలైయార్ శెయ్ వనగళ్ వేణ్డువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లామ్ నడుఙ్గ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్జశన్నియమే
పోల్వన శఙ్గఙ్గళ్, పోయ్ ప్పాడుడై యనవే
శాల ప్పెరుమ్ పఱైయే, పల్లాణ్డిశైప్పారే
కోలవిళక్కే, కొడియే, విదామే
ఆలినిలైయాయ్ ! అరుళేలో రెమ్బావాయ్.

అర్ధం: ఆశ్రిత వ్యామోహం కలవాడా..! ఇంద్రనీలమణిని పోలిన కాంతి, స్వభావం కలవాడా..! అఘటితఘటనా సామర్ధ్యం చే చిన్న మర్రి ఆకులపై ఆదమరిచి నిదురించేవాడా .. మేము మార్గశిర మాసం చేయాలనుకుంటున్నాము.. అందుకే కావాల్సిన వాటికోసం నీ వద్దకు వచ్చాము. ఈ స్నాన వ్రతాన్ని మా పూర్వులు శిష్యులు ఆచరించారు. నీవు విన్నచో దానికి కావాలిన పరికరములు తెలియజేస్తాం. ఈ భూమండలం వణుకునట్టు శబ్దం చేయు పాలవలె తెల్లనైన నీ పాంచజన్యమనే  శంఖమును పోలిన శంఖములు కావలెను, విశాలమైన చాలా పెద్ద ‘పర’మను వాయిద్యం కావలెను.. మంగళ వాయిద్యాలు , మంగళ గానం చేయు భాగవతులు, మంగళ దీపాలు, ధ్వజం, మేలు కట్లు, కావలెను. నీ కృప చూపుము.. అని గోపికలు శ్రీకృష్ణుడిని ఈ 26వ పాశురంలో ప్రార్ధించారు.

Also Read: స్థానికులకు వైకుంఠ దర్శనం అవకాశం.. సర్వ దర్శనం టోకెన్లకు డిమాండ్.. బారులు తీరిన భక్తులు