Dhanurmasa: నేడు తిరుప్పావైలో ఆరో రోజు.. ప్రకృతి వర్ణనతో నేటి నుంచి ఒకొక్క చెలిని నిద్ర లేపుతున్న గోదాదేవి..

|

Dec 21, 2021 | 6:21 AM

Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు ఆరోరోజు. ఈ ధనుర్మాసం నెల రోజులూ విష్ణువుని స్తుతిస్తూ.. ప్రతి దినం గోదాదేవి రచించిన పాశురాలను వైష్ణవాలయాల్లో పాడతారు. ఈ పాశురాల్లో ఆరవ పాశురం నుంచి..

Dhanurmasa: నేడు తిరుప్పావైలో ఆరో రోజు.. ప్రకృతి వర్ణనతో నేటి నుంచి ఒకొక్క చెలిని నిద్ర లేపుతున్న గోదాదేవి..
Thiruppavai 6th Pasuram
Follow us on

Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు ఆరోరోజు. ఈ ధనుర్మాసం నెల రోజులూ విష్ణువుని స్తుతిస్తూ.. ప్రతి దినం గోదాదేవి రచించిన పాశురాలను వైష్ణవాలయాల్లో పాడతారు. ఈ పాశురాల్లో ఆరవ పాశురం నుంచి పది పాశురాల వరకూ గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. ఇక్కడ‌ను౦డి ఒక్కొక్క రోజు ఒక్కొక్క‌ వర్ణనతో గోపికలను నిద్రలేపుతూ ఉంటాయి. పక్షుల కిలకిలారావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలికినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. ఈరోజు ధనుర్మాసంలో ఆరో రోజు.. ఆరో రోజు పాశుర‌ము, దాని అర్ధం తెలుసుకుందాం..

ఆర‌వ‌ పాశుర‌ము

పుళ్ళుమ్ శిలుమ్బిన‌కాణ్ పుళ్ళరైయన్ కోయిలిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్ ఎళున్దిరాయ్ పేయ్ ములైనంజుండు
కళ్ళచ్చగడం కలక్కళియా క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిలమరంద‌ విత్తినై
ఉళ్ళత్తుకొండు మునివరగ‌ళుం యోగిగళుం
మెళ్ళ వెళుందు అరియన్ర పేరరవం
ఉళ్ళం పుగుంధు కుళిరిందేలో రెంబావాయ్

అర్దం: ఓ చిన్నదానా ప‌క్షులు అరుస్తున్నాయి. గ‌రుడుడు వాహ‌న౦గా ఉన్న ఆ స‌ర్వేస్వరుని కోవెల‌లో, తెల్లని శ౦ఖ‌ములు ఊదుతున్నారు. ఆ ధ్వని వినిపించలేదా.. ! పూత‌న‌ పాల‌ను తాగి ఆమెను స౦హ‌రి౦చిన‌వాడు, బ౦డి రూప౦లో వచ్చిన‌ రాక్షసుణ్ణి కాలితో త‌న్ని స౦హ‌రి౦చిన‌వాడు.. స‌ముద్రంలో శేష‌శయ్యపై యోగ‌నిద్రలో ఉన్నవాడును అయిన‌ జగ‌త్తుల‌న్ని౦టికి కార‌ణ‌మైన‌ స‌ర్వేశ్వరుని మ‌న‌స్సులో ధ్యానిస్తూ యోగులూ మునులు హ‌రీ హ‌రీ అ౦టూ మెల్లగా లేస్తున్నారు. ఆ గొప్ప ధ్వని మా మన‌స్సుల‌లో ప్రవశి౦చి మ‌మ్మల్ని నిద్రలేపి౦ది..కావున‌ నీవు కూడా నిద్రలేచి రావ‌మ్మా!

Also Read: తిరుప్పావై ఐదో పాశురం.. పాపాలు తొలిగేందుకు కృష్ణుడికి 8 పుష్పాలను అర్పించమంటున్న గోదాదేవి