TTD Tokens: సర్వదర్శనం టోకెన్ల కోసం బారులు.. క్యూ లైన్లలో భక్తుల పడిగాపులు

|

Apr 09, 2022 | 7:46 PM

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల(Sarvadarshanam Tokens) కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుపతి(Tiruapathi)లో టోకెన్లు జారీ చేసే శ్రీనివాస, భూదేవి కాంప్లెక్స్‌ల్లోని కౌంటర్ల వద్ద భక్తులు బారులు దీరారు....

TTD Tokens: సర్వదర్శనం టోకెన్ల కోసం బారులు.. క్యూ లైన్లలో భక్తుల పడిగాపులు
Tirumala Rush
Follow us on

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల(Sarvadarshanam Tokens) కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుపతి(Tiruapathi)లో టోకెన్లు జారీ చేసే శ్రీనివాస, భూదేవి కాంప్లెక్స్‌ల్లోని కౌంటర్ల వద్ద భక్తులు బారులు దీరారు. ఇవాళ(శనివారం) సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు ఈ నెల 12వ తేదీ నాటికి దర్శన స్లాట్‌ లభిస్తోందని టీటీడీ(TTD) వెల్లడించింది. భక్తుల రద్దీ కారణంగా బుధవారం నాటి సర్వదర్శనం టోకెన్లు మంగళవారం మధ్యాహ్నం నుంచి విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆది, సోమవారాల్లో దర్శన టోకెన్లు కేటాయించమని పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి, సిబ్బంది, అధికారులకు సహకరించాలని కోరింది. కరోనా వెలుగులోకి వచ్చిన అనంతరం రెండేళ్ల తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా సర్వ దర్శనం పునఃప్రారంభించిన అనంతరం తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది.

నేపథ్యంలో మార్చి నెలలో తిరుమలేశుడిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, హుండీ కానుకల వివరాలను టీటీడీ వెల్లడించింది. మార్చిలో 19.72 ల‌క్షల మంది భక్తలు కలియుగ వైకుంఠనాథుడిని ద‌ర్శించుకున్నారు. మార్చి నెలలో స్వామి వారి హుండీ కానుకల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం రూ.128.64 కోట్లు. 9.54 ల‌క్షల మంది భ‌క్తులు శ్రీ‌వారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. 24.10 ల‌క్షల మంది భ‌క్తులు అన్నప్రసాదాలు స్వీక‌రించారు. 1.11 ల‌క్షల ల‌డ్డూల‌ను భ‌క్తుల‌కు పంపిణీ చేశారు.

Also Read

Viral Video: ప్రేమంటే ఇదే మరి.. ఆడపిల్లే అదృష్ట దేవతంటూ.. ఈ వ్యక్తి చేసిన పనికి ఫిదా అవుతోన్న నెటిజన్లు!

KKR vs DC IPL 2022 Match Preview: గత సీజన్‌లో ఒకే జట్టులో.. నేడు ప్రత్యర్థులుగా బరిలోకి.. రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Onions Benefits: వేసవిలో పచ్చిఉల్లితో అనేక లాభాలు.. ఘాటుగా తింటే ఆ సమస్య పరిష్కారం..!