
ఢిల్లీలోని స్వామినారాయణ అక్షరధామ్ క్షేత్రంలో 108 అడుగుల భారీ నీలకంఠ వర్ణి విగ్రహ ప్రతిష్ఠాపన అత్యంత వైభవంగా జరిగింది. పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజ్ పవిత్ర సమక్షంలో గురువారం ఉదయం 6 గంటల నుండి వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్ఠాపన క్రతువు ప్రారంభమైంది. మహంత్ స్వామి మహారాజ్ స్వయంగా 108 అడుగుల ఎత్తులో వైదిక విధులను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విగ్రహం అత్యంత సుందరమైనదని తెలిపారు. ఇది ప్రపంచమంతటా శాంతిని ప్రసాదిస్తుందని.. ఇక్కడికి వచ్చే భక్తులకు నీలకంఠ వర్ణి ఆశీస్సులు, సద్గుణాలు లభిస్తాయని ఆయన తెలిపారు.
Neelkant Varni Statue
ఈ విగ్రహం ప్రపంచంలోకెళ్లా ఒకే పాదంపై నిలబడిన అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టించింది. కేవలం 11 ఏళ్ల వయస్సులోనే నీలకంఠ వర్ణి సుమారు ఏడేళ్ల పాటు దేశమంతా చేసిన కల్యాణ యాత్రకు నిదర్శనంగా ఈ విగ్రహం నిలువనుంది. ముఖ్యంగా పులహాశ్రమంలో నాలుగు నెలల పాటు ఆహారం తీసుకోకుండా ఒంటి కాలిపై నిలబడి ఆయన చేసిన తపస్సుకు నిదర్శనంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Neelkant Varni Statue
మార్చి 25, 26 తేదీలలో జరిగిన ఈ ఉత్సవాల్లో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది భక్తులు, సుమారు 300 మంది సాధువులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా లోక కల్యాణం కోసం, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు ఆగి ప్రపంచమంతా శాంతి నెలకొనలాని బుధవారం’విశ్వశాంతి యజ్ఞం’ నిర్వహించారు. అనంతరం శాంతికి చిహ్నంగా తెల్లని పావురాలను అకాశంలోకి ఎగురవేశారు.
మరిన్ని అథ్యాత్మిక వార్తల కసం ఇక్కడ క్లిక్ చేయండి.