రామానుజ విగ్రహావిష్కరణకి రండి.. స్టాలిన్‌కు చిన్నజీయర్‌ స్వామి ఆహ్వానం

|

Sep 19, 2021 | 3:58 PM

Statue of Equality: రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారు శంషాబాద్ ముచ్చింతల్‌లో అతిపెద్ద సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానాలు అందిస్తున్నారు చిన్నజీయర్ స్వామి.

1 / 4
హైదరాబాద్ శివారు శంషాబాద్ ముచ్చింతల్‌లో అతిపెద్ద సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ బృహత్క్యార్యానికి రావాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి.

2 / 4
ఈ మహోత్సవ ఘట్టానికి దేశంలోని పలువురు ప్రముఖులను స్వయంగా అహ్వానిస్తున్న చిన్నజీయర్‌ స్వామి... ఇవాళ చెన్నైలో సీఎం స్టాలిన్ ను కలిసి ఆహ్వాన పత్రం అందించారు.  చిన్నజీయర్ స్వామి వెంట మై హోమ్ గ్రూప్‌ అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు కూడా ఉన్నారు.

3 / 4
హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని చిన్నజీయర్‌ స్వామి ఆశ్రమంలో 200 ఎకరాల్లో వేయి కోట్లతో భగవద్రామానుజుల 216 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 'స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ'కి నిలువెత్తు నిదర్శనమైన సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు 2022 ఫిబ్రవరి 2 నుంచి 14వరకు కార్యక్రమాలు జరుగుతాయి.

4 / 4
విగ్రహావిష్కరణ సందర్భంగా ఒక వెయ్యి 35 హోమ గుండాలతో ప్రత్యేక యాగం నిర్వహించనున్నారు. కాగా,  సమతా మూర్తి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెం.+91 790 14 2 2022, వెబ్‌సైట్ Statueofequality.org, ఈ-మెయిల్ Srs.samaroham@statueofequality.org