Chanakya Niti: ఆచార్య చాణక్య గొప్ప నైపుణ్యాలు కలిగిన వ్యూహకర్త. తన జ్ఞానం, వ్యూహాలతో.. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడానికి సహాయపడ్డాడు. రాజకీయ చతురత, ఆర్థిక గణాంకాలు, వ్యూహాలు మౌర్య సామ్రాజ్యాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. ఇదిలాఉంటే.. అనేక అంశాల్లో ఎంతో ప్రావీణ్యం కలిగిన చాణక్య.. జీవితానికి సంబంధించి ఏ అంశంలోనూ కంప్రమైజ్ అవ్వలేదు. ఆయన జీవిత సత్యాలు, జీవితంలో ఉన్నత దశకు చేరుకోవాలంటే ఎలాంటి విధానాలు అవలంభించాలనే దానిపై అనేక పుస్తకాలు కూడా రాశారు.
సాధారణంగా ఒక వ్యక్తి క్లిష్ట పరిస్థితుల్లో తన బలం, సహనం, బలాన్ని చూపించాల్సి ఉంటుందని చాణక్య చెబుతుంటారు. వాటి ద్వారానే ఎంతటి విపత్కర పరిస్థితిని అయినా ఎదుర్కొనవచ్చుని అంటారు. విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఆచార్య చాణక్య మూడు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. ఆ విషయాలను తాను రాసిన నీతిశాస్త్రంలో ప్రముఖంగా ప్రస్తావించారు. వీటిని పాటిస్తే ఎంతటి సంక్షోభ సమయం అయినా బయటపడొచ్చని పేర్కొన్నారు. మరి ఆ మూడు పాయింట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సహనంగా ఉండండి…
ఆచార్య చాణక్య నీతిశాస్త్రం ప్రకారం.. సంక్షోభ, విపత్కర సమయాల్లో కచ్చితంగా సహనం పాటించాలి. సంక్షోభ సమయాల్లో చాలా మంది మనస్సు పరధ్యానంలో, కలత చెందినట్లుగా ఉంటుంది. కానీ, ఇలాంటి క్లిష్ట సమయంలోనే కుటుంబ సభ్యులకు అండగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కష్ట సమయాల్లో కుటుంబానికి తోడుగా ఉండాలి. ఇలాంటి విపత్కర సమయాల్లో సహనంతో వ్యవహరిస్తే.. ఈజీగా గడ్డుకాలం నుంచి బయటపడొచ్చు అని చాణక్య పేర్కొన్నారు.
పాజిటివ్ థింకింగ్(సానుకూల వైఖరి)..
కష్ట సమయాల్లో కూడా ఒక వ్యక్తి సానుకూల ఆలోచనను కొనసాగించాలని ఆచార్య చాణక్య చెప్పారు. విపత్కర సమయంతో పోరాడటానికి సానుకూల ఆలోచన మీకు సహాయపడుతుంది. సంక్షోభ సమయంలో ఎప్పుడూ నెగిటీవ్‌గా థింక్ చేయకూడదు. పూర్తి శక్తిని కూడగట్టుకుని.. గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాలి. సంక్షోభ సమయంలో పాజిటివ్ థింకింగ్‌తో పోరాడే వ్యక్తి.. ఎల్లప్పుడూ గెలుస్తూనే ఉంటాడు.
ప్రత్యేక ప్లాన్స్ అవసరం..
ఒక వ్యక్తి తన జీవితంలోని విపత్కర పరిస్థితుల గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ మేరకు ఒక వ్యూహ రచన చేసుకోవాలి. సహనం, ఓర్పుతో వ్యవహరించి.. సంక్షోభాన్ని గట్టి వ్యూహంతో ఢీకొట్టాలి. అప్పుడే విజయాన్ని సాధిస్తారు అని ఆచార్య చాణక్య తెలిపారు.
Also read:
IRCTC Tickets: రైల్వే టికెట్ల కోసం ఏజెంట్లపై ఆధారపడుతున్నారా?.. ఇకపై ఆ అవసరం లేదు.. ఇలా చేయండి..