Chanakya Niti: మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే.. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి..

|

Dec 10, 2021 | 6:56 AM

ఆచార్య చాణక్యుడు తన జీవితంలో ఎన్నో రచనలు చేశారు. అతని రచనలలో తన అనుభవాల సారాంశం మొత్తం రంగరించారు. అయితే వాటిలో ప్రతి ఒక్కరికి ఉపయోగమైనది సరలమైనది చాణక్య నీతి.

Chanakya Niti: మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే.. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి..
Follow us on

ఆచార్య చాణక్యుడు తన జీవితంలో ఎన్నో రచనలు చేశారు. అతని రచనలలో తన అనుభవాల సారాంశం మొత్తం రంగరించారు. అయితే వాటిలో ప్రతి ఒక్కరికి ఉపయోగమైనది సరలమైనది చాణక్య నీతి. ఇందులో రాసిన ప్రతి అంశంపై ఓ అర్థాన్నికలిగి ఉంటుంది. అందులో కొన్ని అంశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇవి మీ మొత్తం జీవితాన్ని మార్చగలవు.

మీరు పనిచేస్తున్న చోట ఎదుటివారిని చూసి ఎప్పుడూ అసూయపడకండి. కష్టపడి పనిచేసే వ్యక్తి తనకు సరైన మార్గాన్ని తానే గుర్తిస్తాడు. అంతే కాదు కష్టపడి పనిచేసేవారు ఎప్పటికీ పేదలుగా ఉండరు. సదా భగవంతుని స్మరించుకునే వారు జీవితంలో ఎప్పటికైనా విజయం సాధిస్తారు

తన లోపాలను బయటపెట్టని వాడు తెలివైనవాడు. ఇంటిలోని రహస్య విషయాలు, అవమానం, మనస్సులోని  చింత, ఈ విషయాలను తన వరకు మాత్రమే పరిమితం చేసుకోవాలి. ఎదుటివారి చెప్పడం వల్ల వారికే నష్టం అంటాడు చాణక్యుడు.

మీరు ఏదైనా పని ప్రారంభించినప్పుడు రాబోయే వైఫల్యానికి భయపడకూడదు. ఆ పనిని మధ్యలో వదిలివేయకూడదు. నిజాయతీగా పని చేసే వ్యక్తులు జీవితంలోని ఎలాంటి పరిస్థితిలోనూ అత్యంత సంతోషంగా పురోగమిస్తూ ఉంటారు.

మీ తేజస్సు ప్రకారం నగలు, వస్త్రాలు ధరించండి. ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తులు.. అలాంటి వారికి సహాయం చేయడంలో మీ సమయాన్ని వృథా చేయకండి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు తమ ప్రయత్నాలను విరమించుకుంటారు. మీపై లేదా పరిస్థితిపై తమను తాము నిందించడం ద్వారా పదే పదే నిరాశకు గురవుతారు. లక్ష్యం నుండి తప్పుకుంటారు. అటువంటి పరిస్థితిలో మీ శ్రమ, సమయం వృధా అవుతుంది.

ఇవి కూడా చదవండి: MLC Elections: నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ పోలింగ్.. టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే…!

PM Modi Tribute: ఢిల్లీ చేరుకున్న రావత్ సహా 13 మంది పార్థివదేహాలు.. నివాళులర్పించిన ప్రధాని మోడీ