Chanakya Neeti
ఆచార్య చాణక్యుడు గొప్ప రాజకీయ వేత్త, దౌత్యవేత్త. చాణక్యుడు వ్యక్తిగా, కుటుంబంలో ఒకనిగా, సమాజంలో ఒక సభ్యునిగా, ఒక పాలకునిగా పాలక వర్గ సభ్యునిగా ఆచరింపవలసిన కర్తవ్యాలు, పాటించవలసిన నియమాలను తెలియజేశారు. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలు నీతి శాస్త్రంలో వివరించారు. ఇందులో వైవాహిక జీవితం, కెరీర్, ఆరోగ్యం, మనుషుల మధ్య సంబంధాలు, ఉద్యోగానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. జీవితంలో వచ్చే అతి పెద్ద సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో డబ్బుకు సంబంధించిన అనేక విషయాల గురించి చెప్పాడు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా.. ఒక వ్యక్తి విజయం సాధిస్తాడు. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లపుడూ మనిషి మీద ఉండాలంటే.. అతను చేయాల్సిన పనులు ఏమిటి.. చేయకూడనివి ఏమిటి తెలుసుకుందాం.
- చాణక్య విధానం ప్రకారం, ఒక వ్యక్తి ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచిస్తూ.. అసంతృప్తి చెందకూడదు. అంతే కాకుండా అందం, ఆహారం విషయంలో అసంతృప్తి గా ఉండకూడాదు. మీకు లభించినదానితో సంతోషంగా జీవించడం అలవాటు చేసుకోవాలి.
- చాణక్య నీతి ప్రకారం, జ్ఞానం లేని జీవితం అసంపూర్ణం. జ్ఞానం లేకుండా ఒక వ్యక్తి విజయం సాధించలేడు. అందుకే ప్రతి వ్యక్తికీ జ్ఞానం అవసరం.
- చాణక్య నీతి ప్రకారం, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ మంచి, చెడు గురించి ఆలోచించండి. దీని వల్ల మీరు జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడదు.
- చాణక్య విధానం ప్రకారం, వివాహానంతరం పురుషులు.. ఇతర స్త్రీల పట్ల ఆకర్షితులు కాకూడదు. ఇది మీ వైవాహిక జీవితంలో సమస్యలను తీసుకుని వస్తుంది.
- చాణక్య విధానం ప్రకారం, మీ కంటే ఎక్కువ లేదా తక్కువ ప్రతిష్ట ఉన్న వ్యక్తులతో స్నేహం చేయవద్దు. అలాంటి వారి స్నేహం మీకు ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వదు. ఇలాంటి స్నేహాల వలన మీరు కూడా అవమానాలు భరించాల్సి రావచ్చు.
- చాణక్య నీతి ప్రకారం.. ఇతరుల తప్పుల నుండి ఎల్లప్పుడూ ఒక పాఠాన్ని నేర్చుకోండి. ఇలా చేసే వ్యక్తులు ఎల్లప్పుడూ విజయాన్ని పొందుతారు. అలాంటి వ్యక్తులు జీవితంలో చాలా ముందుకు వెళ్లి అపారమైన విజయాలు సాధిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..