రేపే లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర. తెల్లవారుజామునుండే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పెద్ద ఎత్తున భక్తులతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు, తదితరులు అమ్మవారిని దర్శించుకానున్నారు. జూలై 16, 17వ తేదీల్లో రెండు రోజులపాటు అమ్మవారికి బోనాల సమర్పించుకోవడంతోపాటు, ఘటాల ఊరేగింపు, తొట్టెల జాతర, పలారం బండ్ల ఊరేగింపు, ఇంతగానో తెలుగు రాష్ట్ర ప్రజలు ఎదురుచూసే ఘట్టం రంగం కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన పటిష్ట ఏర్పాటు, ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు చేశారు. బోనాల సందర్భంగా వారం రోజుల నుండి ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి అమ్మవారికి మహా హారతి నిర్వహించారు. మహా హారతికి వేల సంఖ్యలో ఆలయం బయట మహిళలు అందరూ నిలబడి అమ్మవారికి హారతి ఇచ్చారు. ఇక ఈ వచ్చే ఆదివారం సోమవారం లాల్ దర్వాజా లో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరగనుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..