
మహాభారత యుద్ధానికి ముందు .. తరువాత భీష్మ పితామహుడు అనేక ముఖ్యమైన విషయాలను చెప్పాడు. అవి ఇప్పటికీ జీవితంలో చాలా సందర్భోచితంగా ఉంటుంది. భీష్మ పితామహుడు మహాభారత యుద్ధంలో గొప్ప యోధులలో ఒకరు. గొప్ప తత్వవేత్త. హస్తినాపురాన్ని రక్షించడానికి భీష్మ పితామహుడు తన జీవితాంతం బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. భీష్మ పితామహుడికి ఇచ్ఛ మృత్యువు వరం ఉంది. వంశంలో అత్యుత్తమమైన వ్యక్తి కనుక కౌరవులు, పాండవులు ఇద్దరూ అతన్ని చాలా గౌరవించారు. కౌరవుల తరపున భీష్ముడు యుద్ధంలో పాల్గొన్నాడు. అతను కౌరవులకు, పాండవులకు జీవన విధానాన్ని బోధించాడు. అతని విధానాలను ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కృష్ణుడు, అర్జునుడు అనుసరించారు. నేటి కాలంలో కూడా ఈ విధానాలను అవలంబించడం ద్వారా విజయం సాధించవచ్చు.
మధురంగా మాట్లాడండి. నోరు మంచిది అయితే ఊరు మంచిదనే సామెత.. ఇదే విషయాన్నీ భీష్మ పితామహుడు చెబుతూ ఒక వ్యక్తి ఎల్లప్పుడూ మధురమైన పదాలను ఉపయోగించాలని చెప్పాడు. వ్యక్తికి మంచిగా అనిపించే పదాలతోనే మాట్లాడాలని.. ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టే భాషను ఉపయోగించవద్దని అన్నాడు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి. ఎవరికీ చెడు చెప్పకండి. దీనితో పాటు అహంకారంతో ఎవరినీ ఎప్పుడూ విమర్శించవద్దని చెప్పాడు భీష్ముడు.
త్యాగం చేసే గుణం: కోరిక మాత్రమే కాదు.. త్యాగం చేసే మనస్తత్వం కూడా ఉండాలి. ఏదైనా త్యాగం చేయకుండా ఎటువంటి విజయాన్ని సాధించలేము. త్యాగం లేకుండా వ్యక్తి ఎలాంటి భయాన్ని వదిలించుకోలేడు. జీవితంలో అనేక విషయాలను త్యాగం చేయడం ద్వారా మాత్రమే అంతర్గత ఆనందాన్ని పొందవచ్చు.
ఆనందాన్ని పొందడం: భీష్మ పితామహుడు మూర్ఖులు లేదా అత్యున్నత జ్ఞానాన్ని పొందిన వారు మాత్రమే ఆనందాన్ని పొందగలరని చెప్పారు. మధ్యలో చిక్కుకున్న వారు ఎల్లప్పుడూ దుఃఖంతో ఉంటారు.
లక్ష్యాలను నిర్దేశించుకోండి: భీష్మ పితామహుడు మనిషి తన మార్గాన్ని, లక్ష్యాన్ని తానే నిర్ణయించుకోవాలని చెప్పాడు. ఇతరుల చేతుల్లో కీలుబొమ్మగా మారిన వ్యక్తి ఏ నిర్ణయాన్ని సొంతంగా తీసుకోలేదు. దీంతో అతను జీవితంలో ఏమీ సాధించలేడు. కాలానికి అనుగుణంగా తనను తాను మలుచుకునే వ్యక్తి అంతిమ ఆనందాన్ని పొందుతాడు.
స్త్రీల పట్ల గౌరవం: స్త్రీని అవమానించడం అంటే ప్రపంచం నాశనం కోసమే అన్నట్లు.. భీష్ముడి ప్రకారం స్త్రీని ఎప్పుడూ అవమానించకూడదు. స్త్రీ గౌరవించడంలోనే ఆమె ఆనందం ఉంటుంది. స్త్రీని గౌరవించే ప్రాంగణంలోనే లక్ష్మి కూడా నివసిస్తుంది.
మార్పు: మహాభారతంలో భీష్మ పితామహుడు మార్పు మాత్రమే ఈ ప్రపంచానికి శాశ్వత నియమం అని చెప్పాడు. ఏ కాలమూ లేదా వ్యక్తి శాశ్వతంగా ఉండడు. ప్రతిదీ మారుతుంది. ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. మార్పును అంగీకరించాలి దానిలో మంచి ఉంది.
అధికారాన్ని పొందడం: భీష్మ పితామహుడు చెప్పిన ప్రకారం, అధికారం అనేది కేవలం ఆనందం కోసమే పొందకూడదు. అధికారం పొందిన తర్వాత సమాజ శ్రేయస్సు కోసం కష్టపడి పనిచేయాలి. సమాజ శ్రేయస్సు అధికారంలో ఉన్నవారి చేతుల్లో ఉంటుంది . కనుక అధికారాన్ని పొందేటప్పుడు.. ఆ వ్యక్తికీ ప్రజా సంక్షేమ భావన కలిగి ఉండాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.