zodiac signs: తగ్గేదే లే.. ఈ 5 రాశిచక్రాల వారు ఏ విషయంలోనూ వెనుకడుగు వేయరు.. ఇందులో మీరున్నారా చెక్ చేసుకోండి..!

|

Mar 30, 2022 | 6:50 AM

zodiac signs: కొంతమందిలో పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుండి వారు ఇతర వ్యక్తులతో పడాలని, అన్ని రకాల పోటీల్లో విజయం..

zodiac signs: తగ్గేదే లే.. ఈ 5 రాశిచక్రాల వారు ఏ విషయంలోనూ వెనుకడుగు వేయరు.. ఇందులో మీరున్నారా చెక్ చేసుకోండి..!
Follow us on

zodiac signs: కొంతమందిలో పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుండి వారు ఇతర వ్యక్తులతో పడాలని, అన్ని రకాల పోటీల్లో విజయం సాధించాలని తపిస్తుంటారు. వీరు పోటీ వాతావరణంలో వృద్ధి చెందుతారు. అందుకే.. ఎలాంటి పోటీ అయినా గెలుస్తుంటారు. ఒక్కసారి తాము సాధించాలని ఫిక్స్ అయితే.. దానికి తిరుగే ఉండదు. తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలపై పక్కా గురి పెడతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 5 రాశుల వారిలో పోటీతత్వం అధికంగా ఉంటుందట. మరి రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సింహ రాశి..
ఈ రాశి వారికి తమపై తమకు అపారమైన నమ్మకం ఉంటుంది. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి అవసరమైన దానికంటే ఎక్కువ కష్టపడుతారు. దీనికంటే ముందు తమలోని లోపాలను గుర్తించి సని చేసుకుంటారు. ఆ లోపాలు తమ లక్ష్యంపై ప్రభావితం కానివ్వరు. అలా తాము నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతారు.

మకరరాశి..
వీరు విజయ పరంపరను కొనసాగించడానికి ఆసక్తి చూపుతారు. వీరిటో విపరీతమైన పోటీతత్వం ఉంటుంది. కెరీర్‌తో ఎదిగేందుకు తీవ్రంగా శ్రమిస్తారు. ఇంకో విశేషమేంటంటే.. వీరు అప్రయత్నంగానే కొన్ని పోటీల్లో చెమట పట్టకుండానే గెలుస్తారు. ఇది వారి కృషి, దృఢ సంకల్పం ఫలితం.

కుంభ రాశి..
ఈ రాశి వారిని అంతర్ముఖులుగా పేర్కొంటారు జ్యోతిష్య పండితులు. వీరు ఎక్కువగా మౌనంగా ఉంటారు. తమ రహస్యాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. సైలెంట్‌గా విజయపథంలో దూసుకుపోతారు. తమకంటూ ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని.. ఆ లక్ష్యాన్ని సునాయాసంగా చేరుతారు.

మేషరాశి..
ఈ రాశి వారు కూడా విపరీతమైన పోటీతత్వం కలిగి ఉంటారు. వీరు లక్ష్యం ఉన్నతంగా ఉంటుంది. తమ పని పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. నమ్మకమైన ప్రవర్తనతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. తమ లక్ష్యాన్ని వీలైనంత త్వరగా చేరుకునే వరకు శ్రమిస్తారు.

ధనుస్సు రాశి..
నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో చేరుకుంటారు. వైఫల్యాల గురించి పెద్దగా పట్టించుకోరు. కేవలం సానుకూల అంశాలను రిసీవ్ చేసుకుంటూ ముందుకు కదులుతారు. ఇది సాధించి తీరాలని ఒకసారి వారు డిసైడ్ అయితే.. ఏది ఏమైనా సాధించి తీరుతారు.

(గమనిక: మత విశ్వాసాలు, మత గ్రంధాల ఆధారంగా ఈ వివరాలను పబ్లిష్ చేయడం జరిగింది. వీటిని టీవీ9 తెలుగు నిర్ధారించలేదు. వీటికి బాధ్యత వహించదు.)

Also read:

Telangana Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై అలా చేశారంటే అంతే సంగతలు..!

TSTET 2022: టెట్ అభ్యర్థులూ బీ అలర్ట్.. టెట్‌ వెబ్‌‌సై‌ట్‌లో పాత హాల్‌‌టి‌కెట్లు..

Telangana: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..