సతీదేవి కన్నీరు పడిన ప్రాంతం.. భక్తులతో స్వయంగా మాట్లాడి ప్రసాదం ఇచ్చే అమ్మవారు.. విదేశీ భక్తులు క్యూ కట్టే ఆలయం ఎక్కడంటే..

|

Oct 16, 2024 | 3:11 PM

అచ్రు మాత ఆలయంలో ఒక అద్భుత చెరువు ఉంది. ఆ చెరువునుంచి వచ్చే తన భక్తులతో అమ్మవారు మాట్లాడుతుందని.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుందని నమ్ముతారు. దీని తరువాత భక్తుల కోరికలు తీర్చడానికి అమ్మవారు చెరువు నుంచే భక్తులను అనుగ్రహిస్తుంది. అంతే కాకుండా భక్తుడి కోరిన కోరిక పూర్తవుతుందో లేదో కూడా అమ్మవారు చెబుతుందని చెబుతారు.

సతీదేవి కన్నీరు పడిన ప్రాంతం.. భక్తులతో స్వయంగా మాట్లాడి ప్రసాదం ఇచ్చే అమ్మవారు.. విదేశీ భక్తులు క్యూ కట్టే ఆలయం ఎక్కడంటే..
Achhru Mata Mandir
Follow us on

భారతదేశాన్ని దేవాలయాల దేశం అంటారు. ఇక్కడ అనేక పురాతన, అద్భుత దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో జరిగే అద్భుతాలు నేటికీ రహస్యమే.. వాటిని ఇప్పటి వరకు ఎవరూ చేధించలేకపోయారు. కొన్ని దేవాలయాల మెట్లపై సప్త స్వరాలు వినిపిస్తాయి. మరికొన్ని చోట్ల శ్రీకృష్ణుడు స్వయంగా వేణువు వాయిస్తాడు. గాలిలో ఆలయ స్థంభం వేలాడడం, గుడి గోపురం నీడ పడని అద్భుతం వంటివి ఎన్నో ఉన్నాయి. అలాంటి అద్భుత దేవాలయాల్లో ఒకటి మధ్యప్రదేశ్‌లో ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు తన భక్తులతో మాట్లాడి వారి సమస్యలన్నింటినీ తొలగిస్తుందని అంతే కాదు భక్తులకు స్వయంగా ప్రసాదం ఇస్తుందని నమ్ముతారు. ఈ ఆలయానికి సంబంధించిన అద్భుతాలపై పరిశోధన చేసిన పరిశోధకులకు సమాధానం నేటికీ దొరకలేదు

ఈ ఆలయం ఎక్కడ ఉంది?

ఈ అద్భుత ఆలయం మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలోని పృథ్వీపూర్ తహసీల్ ప్రాంతంలోని గ్రామ పంచాయితీ మడియాలో ఉంది. ఈ ఆలయం పేరు పేరు అచ్రు మాత దేవాలయం. ఈ ఆలయంలోని అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది. దీంతో భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయంలో అమ్మవారు తన భక్తులతో మాట్లాడి వారి కోరికలు తీరుస్తుందని నమ్ముతారు. ఆలయానికి సంబంధించిన ఈ విశిష్ట రహస్యం గురించి తెలుసుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించారు. అయతే నేటి వరకు ఈ రహస్యాన్ని ఎవరూ కనుగొనలేకపోయారు.

ఇవి కూడా చదవండి

ఆలయంలో ఉన్న కుండంలో ఉన్న భక్తులతో మాట్లాడే అమ్మవారు

అచ్రు మాత ఆలయంలో ఒక అద్భుత చెరువు ఉంది. ఆ చెరువునుంచి వచ్చే తన భక్తులతో అమ్మవారు మాట్లాడుతుందని.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుందని నమ్ముతారు. దీని తరువాత భక్తుల కోరికలు తీర్చడానికి అమ్మవారు చెరువు నుంచే భక్తులను అనుగ్రహిస్తుంది. అంతే కాకుండా భక్తుడి కోరిన కోరిక పూర్తవుతుందో లేదో కూడా అమ్మవారు చెబుతుందని చెబుతారు.

అమ్మ ప్రసాదం ఇస్తుంది

ఈ ఆలయంలో అమ్మవారు తన భక్తులతో మాట్లాడే ముందు, వారి కోరికలు తీర్చే ముందు వారికి ప్రసాదం ఇస్తుందని స్థానిక ప్రజలు చెబుతారు. నిమ్మ, ద్రాక్ష, పూలు, జిలేబి, పెరుగు, చిరోంజి మొదలైన వాటిని భక్తులకు ప్రసాదంగా అందజేస్తుందని భక్తులు చెబుతున్నారు. కోరిన కోర్కెలు నెరవేరాతాయని భక్తులకు తెలియజేస్తూ అమ్మవారు ప్రసాదం అందజేస్తారని చెబుతారు.

చెరువులో నీరు ఎండిపోదు

ఈ ఆలయంలోని ఈ చెరువులోని నీరు ఎప్పుడూ ఎండిపోదని ప్రజలు చెబుతున్నారు. వేసవి కాలంలో బుందేల్‌ఖండ్ మొత్తం నీటి కొరత ఉంటుందని చెబుతారు. అయితే ఎత్తైన కొండపై ఉన్న ఈ ఆలయంలో ఉన్న చెరువు ఎల్లప్పుడూ నీటితో నిండి ఉంటుంది.

ఆలయ చరిత్ర

ఈ ఆలయ చరిత్ర ఆశ్చర్యకరంగా ఉంటుందని చెబుతారు. ఇక్కడ ఒక గొర్రెల కాపరికి అమ్మవారు దర్శనమిచ్చినట్లు స్థానికులు చెబుతారు. కథ ప్రకారం చాలా సంవత్సరాల క్రితం అచ్చరు అనే పశువుల కాపరి ఉండేవాడు. రోజూ తన గేదెలను మేత కోసం అడవికి తీసుకెళ్లేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా అతని గేదె ఎక్కడో తప్పిపోయింది. ఆ తర్వాత అచ్రు తన గేదె కోసం అడవి మొత్తం వెతికినా ఎక్కడా కనిపించలేదు. అలసటగా అనిపించి చెట్టుకింద కూర్చున్నాడు. అతను కూర్చున్న స్థలంలో ఒక బావి ఉంది. అకస్మాత్తుగా ఆ బావిలోంచి అమ్మవారు ప్రత్యక్షమై ఆ పశువుల కాపరికి గేదె చిరునామా చెప్పింది. అతని అలస తీరడానికి చెరువులోని నీరు తాగమని సలహా ఇచ్చింది అమ్మవారు.

అచ్చరు చెరువులో నీళ్లు తాగుతున్న సమయంలో కర్ర చెరువులో పడి పోయింది. దీంతో కర్ర లేకుండానే అమ్మవారు చెప్పిన ప్రదేశానికి చేరుకుని అక్కడ ఉన్న తన కర్రను, గేదెను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచి రోజూ ఆ పశువుల కాపరి ఆ చెరువు వద్దకు వెళ్లి అమ్మవారిని పూజించడం ప్రారంభించాడు. ఆ తరువాత క్రమంగా ఆ ప్రదేశంలో జరుగుతున్న అద్భుతాల గురించి ఆనోటా ఈ నోటా చుట్టుపక్కలకు వ్యాపించింది. తర్వాత ఈ ప్రదేశం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత భక్తులు ఇక్కడ అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు. పశువుల కాపరి పేరుతో అచ్రు మాతగా అమ్మవారిని పిలుస్తున్నారు.

ఈ చెరువులో నీరు, ప్రసాదం ఎక్కడి నుంచి వస్తుందని

ఆలయంలోని చెరువులోని నీరు, ప్రసాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునేందుకు చాలాసార్లు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఎవరూ కనుగొనలేకపోయారు

సతీదేవి కన్నీళ్లు పడిన కథ:

దక్ష్ ప్రజాపతి తన యాగం చేసినప్పుడు శివుడిని అవమానించాడు. అప్పుడు సతీదేవి కళ్లలో నీళ్ళు రాలాయని, ఇక్కడే కన్నీళ్లు పడ్డాయని కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది. ఈ ప్రదేశం భూమికి కేంద్రం అని చెబుతారు.

చెరువు నీరు ఎర్రగా

ఆలయానికి సంబంధించి ప్రజలు అనేక కథలు ఉన్నాయి. ఒకసారి ఈ చెరువు పరిసరాలను శుభ్రం చేస్తున్నప్పుడు.. చెరువు ముఖద్వారం వద్ద ఉన్న నాచును ఇనుప గొడ్డలితో  కొట్టి శుభ్రం చేయడానికి ప్రయత్నించారు.. అప్పుడు ఈ చెరువు నీరు ధ్వంసమైంది. చెరువులోని నీరు రక్తంలా ఎర్రగా మారిపోయిందని చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)