
Vastu Shastram : ఇంటిని శుభ్రపరిచే చీపురును సరైన మార్గంలో వినియోగిస్తే అది సంతోషాన్ని, శ్రేయస్సును పెంచుతుంది. అయితే దానిని మనం అగౌరపరిస్తే చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. సంపద గురించిన విషయాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. చీపురు సంపద దేవత లక్ష్మికి చిహ్నంగా భావిస్తారు. అందుకే వాస్తు ప్రకారం చీపురుకు సంబంధించిన కొన్ని నియమాలు తెలుసుకోండి..
1. చీపురు ఎక్కడ పెట్టాలి
వాస్తు ప్రకారం చీపురును ఎప్పుడూ బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. బయట నుంచి వచ్చే వ్యక్తి చూడలేని ప్రదేశంలో దాచి ఉంచాలి . వాస్తు ప్రకారం పశ్చిమ దిశలో చీపురు పెట్టడానికి సరైన ప్రదేశం. వాస్తు ప్రకారం వంటగదిలో చీపురు ఉంచరాదు. చీపురు ఎప్పుడూ నేలపై పడుకునే విధంగా పెట్టాలి. చీపురును ఎప్పుడు నిటారుగా ఉంచరాదు.
2. ఎప్పుడూ అగౌరవపరచవద్దు
చీపురు లక్ష్మీ దేవికి చిహ్నం. ఎప్పుడు దానిని అగౌరవపరచకూడదు. చీపురును ఎప్పుడూ తాకవద్దు, గట్టిగా కొట్టవద్దు. సూర్యాస్తమయం తర్వాత చీపురుతో ఊడవకూడదు. అది డబ్బు నష్టానికి దారితీస్తుంది.
3. చీపురును ఎప్పుడు మార్చాలి?
వాస్తు ప్రకారం.. విరిగిన చీపురును ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఎందుకంటే విరిగిన చీపురుతో ఇంటిని శుభ్రపరచడం వల్ల జీవితంలో అన్ని రకాల సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో దాన్ని వెంటనే మార్చాలి. చీపురును ఎల్లప్పుడూ కృష్ణ పక్షంలో కొనుగోలు చేయాలి దీనిని శనివారం ప్రారంభించడం శ్రేయస్కరం.
4. డబ్బు, వ్యాపారం చేయవద్దు
వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం ఎవరికీ రుణాలు ఇవ్వవద్దు. ఇలా చేయడం ద్వారా తల్లి లక్ష్మి వెళ్లిపోతుందని నమ్మకం. దీంతో పాటు ఇంట్లో డబ్బు సమస్యలు మొదలవుతాయి. అందువల్ల సాయంత్రం సమయంలో రుణాలు తీసుకోవడం మానుకోవాలి.
5. ఈ సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి..