Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

మెట్టు దిగిన శివసేన.. కొత్త ప్రతిపాదనేంటంటే ?

sivasena came up with new formula, మెట్టు దిగిన శివసేన.. కొత్త ప్రతిపాదనేంటంటే ?

శివసేన మెట్టు దిగుతోంది.. ముఖ్యమంత్రి పీఠాన్ని చెరి రెండున్నరేళ్లు షేర్ చేసుకోవాలన్న ప్రధాన డిమాండ్‌ని పక్కన పెట్టేందుకు సిద్దమవుతోంది. అందుకే ప్రతిపాదన మార్చి బిజెపి ముందుకు తెచ్చింది. అయితే.. శివసేన కొత్త ప్రతిపాదనపై కూడా బిజెపి అంతగా సుముఖంగా లేకపోవడంతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే వుంది.

అసెంబ్లీ ఫలితాలు వెలువడినప్పట్నించి ఎవరికి వారే ప్రకటనలకు పరిమితమై పరస్పరం చర్చలకు కూడా సిద్దపడని బిజెపి, శివసేన పార్టీల మధ్య ఫార్మల్ చర్చలు మొదలయ్యాయి. ఫలితాలు వెలువడుతుండగానే ముఖ్యమంత్రి పీఠాన్ని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలన్న డిమాండ్‌ను శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తెరమీదికి తెచ్చారు. ఆ తర్వాత పలువురు శివసేన నేతలు కూడా అదే స్వరాన్ని వినిపించారు. కొందరైతే అడుగు ముందుకేసి.. మహారాష్ట్రలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ ఉద్ధవ్ థాక్రే చేతిలో వుంటుందని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో అసలు బిజెపి-శివసేన సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరుతుందా లేక కొత్త రాజకీయ సమీకరణలు ఏమైనా జరుగుతాయా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దానికి తోడు శివసేనను కలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అంటూ ఆ పార్టీ నేతలు కొందరు కూడా కామెంట్ చేశారు. దాంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల సంకీర్ణ సర్కార్ కూడా కొలువు దీరే అవకాశాలున్నాయంటూ వార్తలు, కథనాలు వెలుగులోకి వచ్చాయి.

అయితే.. వీటన్నంటికీ తెరదించుతూ శివసేన-బిజెపి మధ్య ఫార్మల్ చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ చర్చలు సానుకూలంగా ఎంత దూరం వెళతాయన్నది సందేహంగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. శివసేన ముఖ్యమంత్రి పీఠం వదులుకునేందుకు సిద్దపడుతున్నా.. అందుకు బదులుగా కీలకమైన కేబినెట్ పోర్టుఫోలియోలను అడుగుతోంది. హోం, అర్బన్ డెవెలప్‌మెంట్, రెవెన్యూ శాఖలను శివసేనకు కేటాయించాలని శివసేన కండీషన్ బిజెపి ముంగిట పెట్టింది.

అయితే.. వచ్చే అయిదేళ్ళు తానే ముఖ్యమంత్రి నంటూ ఇదివరకే ప్రకటించిన దేవేంద్ర ఫడ్నవీస్.. శివసేన అడుగుతున్న పోర్టుఫోలియోలను ఇచ్చేందుకు పేచీ పెడుతున్నారు. రెవెన్యూ, హౌజింగ్, రూరల్ డెవలప్‌మెంట్ పోర్టుఫోలియోలను ఇచ్చేందుకు ఆయన ఓకే అంటున్నారు. హోం శాఖతోపాటు ముంబయి మహానగరంతో ముడిపడి వున్న అర్బన్ డెవలప్‌మెంట్ పోర్టుఫోలియోలను ఇచ్చేందుకు ఫడ్నవీస్ ససేమిరా అంటున్నారు.

శివసేన, బిజెపిలకు చెందిన క్యాంపుల నుంచి అత్యంత కీలక సమాచారం మీడియాకు వెల్లడైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునేందుకు బిజెపి సిద్దంగా లేకపోవడంతో కనీసం కేబినెట్‌లోనైనా సమాన సంఖ్యలో పదవులు పొందాలని శివసేన భావిస్తోంది. దాంతో పాటు కీలకమైన హోం, అర్బన్ డెవలప్‌మెంట్, రెవెన్యూ శాఖలను తమ పార్టీకి కేటాయించాలని పట్టుబడుతోంది. శివసేనని కాదని బిజెపి ఎలాగో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు కాబట్టి అత్యంత కీలకమైన పోర్టుఫోలియోలనైనా పొందాలన్న వ్యూహం శివసేన అధినాయకత్వంలోకనిపిస్తోంది. కీలకమైన పోర్టుఫోలియోలిచ్చేందుకు కూడా బిజెపి సిద్దంగా లేకపోతే సమస్య మళ్ళీ మొదటికి రాకతప్పదని శివసేన ప్రతినిధులు అంటున్నారు.

1995 నుంచి సంకీర్ణ ప్రభుత్వాలను చూస్తున్న మహారాష్ట్రలో తొలి నాళ్ళలో శివసేన ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి, బిజెపికి డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చింది. హోం శాఖ వంటి కీలక శాఖలను కూడా బిజెపికి కేటాయించింది శివసేన. అదే పార్ములాను ఇప్పుడు బిజెపి అవలంభించాలని, ముఖ్యమంత్రి పీఠాన్ని తీసుకుంటున్నప్పుడు కీలకమైన పోర్టు ఫోలియోలను శివసేనకు ఇస్తే తప్పేంటని శివసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే శివసేన వాదనలో అర్థమే లేదంటున్నారు కమలనాథులు. రెండు పార్టీలు గెలిచిన సీట్ల నెంబర్‌లో తేడాని చూడాల్సిన అవసరం వుందంటున్నారు. బిజెపి 105 సీట్లలో గెలిస్తే.. శివసేన 56 సీట్లలో మాత్రమే గెలిచిన సంగతి వారు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ పంచాయితీ మరో వారం కొనసాగే సంకేతాలున్నాయని తెలుస్తోంది.