Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

రాహుల్ విజయం వెనుక జగన్..! ఇంకెవరున్నారంటే..?

Singer Rahul Sipliunj on secret behind his Victory in Bigg Boss 3, రాహుల్ విజయం వెనుక జగన్..! ఇంకెవరున్నారంటే..?

ఏంటి షాక్‌ అయ్యారా..? నిజంగా.. స్వయానా.. ఇవి బిగ్‌బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ చెప్పిన మాటలు. బిగ్‌బాస్ 3 టైటిల్ విన్నర్‌గా.. అనూహ్యంగా.. అత్యధిక ఓట్ల మెజార్టీతో.. రాహుల్ బిగ్‌బాస్ 3 విజేతగా నిలిచాడు. ఎంతో ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ ఉన్న శ్రీముఖిని సైతం వెనక్కి నెట్టి.. టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అనంతరం టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తిర విషయాలను బయటపెట్టాడు.

ముందు నుంచీ నేను సాంగ్ వీడియోస్ తీయడం ప్లస్ అని.. నాకు మొదటినుంచీ.. యూట్యూబ్‌కి 5 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారని ఇంటర్య్యూలో చెప్పాడు రాహుల్. దాంతో పాటుగా.. బహుశా ఎలక్షన్స్ టైంలో.. వైఎస్‌ జగన్‌ గారికి నేను పాట పాడానని.. ఒకవేళ అదే ప్లస్‌ పాయింట్ అయి ఉండొచ్చని.. ఈ విషయం నాకు కూడా తెలీదని.. హౌస్‌ నుంచి బయటకు రాగానే.. అందరూ చెబుతున్నారని చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా.. ఏపీ నుంచి కూడా నాకు బాగా సపోర్ట్ లభించినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయినట్టు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. నేను బయట ఎలా ఉన్నానో.. ఇంట్లో కూడా అలానే ఉన్నాని.. దాంట్లో ఎలాంటి మార్పులు లేవని అన్నాడు రాహుల్. అయితే.. గత మూడు వారాల క్రితం నుంచి.. సీఎం జగన్‌ అభిమానులు.. ఫ్యాన్స్‌ అంతా ఓ గ్రూపులా ఏర్పడి.. రాహుల్‌‌కి ఓట్లు వేసి మద్దతు తెలిపారట. అందుకనే.. భారీ మెజార్టీ ఓట్ల తేడాతో.. రాహుల్ విన్ అయినట్టు సమాచారం.