Breaking News
  • ఈఎస్‌ఐ స్కామ్‌పై స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరాం. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుంది. గత ప్రభుత్వంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగింది-జయరాం. అవినీతిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాం. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం-జయరాం. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్ము రికవరీ చేస్తాం. అవినీతికి పాల్పడిన వారినెవ్వరినీ వదిలిపెట్టం-మంత్రి జయరాం
  • వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను వక్రీకరించారు-ఇంతియాజ్‌ జలీల్‌. అలాంటి వ్యాఖ్యలను పార్టీ సమర్ధించదు. వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. -టీవీ9తో మహారాష్ట్ర ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌.
  • తూ.గో: అన్నవరం ఆలయానికి కొత్త పాలక మండలి నియామకం. 16 మందితో కొత్త పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో వివాదాస్పదమైన అప్పటి మంత్రి పితాని వ్యవహారం. మందుల సరఫరా బిల్లుల చెల్లింపులో మొదట సరఫరా చేసిన వాళ్లకే.. బిల్లులు చెల్లించాలని ఆదేశించిన అప్పటి కార్మికశాఖ కార్యదర్శి. కార్మికశాఖ కార్యదర్శి ఆదేశాలను అడ్డుకున్న పితాని సత్యానారాయణ. తమకు నచ్చిన వాళ్లకే ఇచ్చేలా వ్యవహరించారని పితానిపై ఆరోపణలు.
  • ప్రకాశం: ఒంగోలులో ఏఎన్‌ఎం హైమావతి ఆత్మహత్యాయత్నం. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన హైమావతి. హైమావతి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. విధుల నుంచి తొలగించడంతో ఆత్మహత్యకు యత్నించిందన్న స్థానికులు. తనను పర్మినెంట్‌ చేస్తామంటూ అపోలో ఏజెన్సీకి చెందిన.. ప్రదీప్‌, గణేష్‌లు రూ.3 లక్షలు తీసుకున్నారని హైమావతి ఆరోపణలు.

ఛలో లడఖ్ ! ఇక సియాచిన్.. టూరిస్టుల స్వర్గధామం..

siachin.. your next vacation spot, ఛలో లడఖ్ ! ఇక సియాచిన్.. టూరిస్టుల స్వర్గధామం..

35 ఏళ్ళ అనంతరం సియాచిన్ మళ్ళీ ప్రారంభమైంది. లడఖ్ లో ఉన్న ఈ ప్రాంతం తిరిగి టూరిస్టులతో కళకళలాడబోతోంది. కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ ను ప్రకటించడానికి ముందు సియాచిన్ లోని అత్యంత ప్రధానమైన ‘ కల్నల్ చెవాంగ్ రిచెన్ సేతు ‘ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఇన్నాళ్లూ మూసివేసిన 430 మీటర్ల పొడవైన ఈ వంతెనను తిరిగి ప్రారంభించడం వల్ల క్రమేపీ పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో సియాచిన్ పై కన్నేసిన పాకిస్తాన్.. 1980 ప్రాంతాల్లో తన సైనిక దళాలను ఇక్కడ మోహరించే ప్రయత్నం చేసింది. ఆ దేశ ‘ దుస్సాహసం ‘ పై మండిపడిన భారత్ వెంటనే తానూ మన జవాన్లను ఈ ప్రాంతానికి తరలించింది.1984 లో చేబట్టిన ‘ ఆపరేషన్ మేఘదూత్ ‘ ఇందులో భాగమే ! అప్పటినుంచీ ఈ ప్రాంతం భారత ఆధీనంలోనే ఉంటూ వచ్చింది. ఇక్కడి ఎత్తయిన పర్వతాలు, హిమ నదీనదాలు, టూరిస్టులను ఎంతో ఆకర్షించాయి. కారాకోరం రేంజిలో సముద్ర మట్టానికి సుమారు 20 వేల అడుగుల ఎత్తున ఉంది సియాచిన్ గ్లేసియర్.. కొండచరియలు అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తాయి. . శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువకు పడిపోయినప్పటికీ.. పర్యాటకులు నులివెచ్చ్చని స్వెటర్లు, ఉన్ని దుస్తులు ధరించి ఈ ప్రాంత అందాలను ఆస్వాదిస్తారు. ఇన్నేళ్లకు సియాచిన్ గ్లేసియర్ మళ్ళీ టూరిస్టులకు కనువిందు చేయబోతోంది. అలాగే లడఖ్ ప్రాంత ఆదాయం కూడా పెరగనుంది.siachin.. your next vacation spot, ఛలో లడఖ్ ! ఇక సియాచిన్.. టూరిస్టుల స్వర్గధామం.. siachin.. your next vacation spot, ఛలో లడఖ్ ! ఇక సియాచిన్.. టూరిస్టుల స్వర్గధామం..siachin.. your next vacation spot, ఛలో లడఖ్ ! ఇక సియాచిన్.. టూరిస్టుల స్వర్గధామం..

Related Tags