Breaking News
  • భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌.భారత్‌లో నిన్న 54,736 కరోనా కేసులు నమోదు, 853 మంది మృతి దేశవ్యాప్తంగా 17,50,724కు చేరిన పాజిటివ్‌ కేసులు.భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 37,364 మంది మృతి.5,67,730 యాక్టివ్‌ కేసులు, ఇప్పటి వరకు 11,45,630 మంది డిశ్చార్జ్.
  • రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్ర శేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో సమర్దవంతమైన, కచ్చితమైన సేవలు అందించడానికి e-ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ తెలిపారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సెక్రటేరియట్ లోని 8 శాఖలలో, HoD లలో 2 శాఖలలో e-ఆఫీసును ప్రారంభించారు.
  • హైదరాబాద్ లో పెరిగిన ఫోర్ వీలర్లఅమ్మాకాలు . మేనెలతో పోల్చితే రెండు నుంచి మూడింతలు పెరిగిన సేల్స్. సేల్స్ పెరగడంతో రిజిస్ట్రేషన్లు పెరిగాయంటున్న హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు . మే నెలలో 326 ఫోర్ వీలర్ల రిజిస్ట్రేషన్లు. జూన్ లో 848 , జూలై లో 1149 రిజిస్ట్రేషన్లు . ఆర్ టి ఎ హైదరాబాద్ జాయింట్ కమిషనర్ పాండు రంగా నాయక్.
  • హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్. హైదరాబాద్ పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ ల మేళా ను సాలార్ జుంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసము. పాతబస్తీ లో సత్ప్రవ్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ పై పోలీస్ రికార్డుల్లో నుంచి రౌడీ షీట్ తొలగించము. వీరంతా కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం కలిపించం. గతంలో వీరంతా తప్పులు చేసి, నేరాలు చేసి జైల్ వెళ్లిన వారు. కానీ ఇప్పుడు ఒక సదవకాశం వీరు అందరికీ ఆదర్శంగా ఉండి కుటుంబం తో సంతోషంగా జీవించాలని సాధారణ పౌరులుగా వుండాలని కోరుతున్న.
  • విజయవాడ: కోవిడ్‌ ఆస్పత్రి సిబ్బంది చేతివాటం. రోగుల మొబైల్స్, డబ్బులు మాయం. సెల్‌ చోరీ చేస్తున్న దృశ్యాలు. సీసీ కెమెరాల్లో రికార్డు. ఒక రోగి అదృశ్యంపై అధికారులు సీసీ కెమెరాలు పరిశీలన. ఓ ఉద్యోగి రోగి సెల్‌ఫోన్‌ తస్కరించడం చూసి అధికారులు షాక్. ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ఉద్యోగి పై ఎవరు అనే కోణంలో దర్యాప్తు. సిబ్బంది ప్రవర్తనపై అధికారులు ఆరా.
  • అమరావతి: 3 రాజధానుల బిల్లు ఆమోదంపై హైకోర్టులో మరో పిల్. హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేసిన రాజధాని రైతులు శ్రీనివాసరావు, సాంబశివరావు. అధికార వికేంద్రీకరణ బిల్లుల ఆమోదం సవాలు చేస్తూ ఒక పిటిషన్. సీఆర్డీఏ రద్దు సవాలు చేస్తూ రెండో పిటిషన్. జేఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ, బోస్టన్ స్. కన్సల్టెన్సీ నివేదికలు, కమిటీలను సవాలు చేస్తూ మూడో పిటిషన్ దాఖలు. రేపు విచారణకు వచ్చే అవకాశాలు. ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన రాజధాని పరిరక్షణ సమితి.

సమన్వయం సరే!..సీట్ల లొల్లి తేలేదెప్పుడు?

Maharashtra polls, సమన్వయం సరే!..సీట్ల లొల్లి తేలేదెప్పుడు?

మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ లాంటి విపక్షాలు బీజేపీ-శివసేనకు సవాలు విసరగలవా? లేక ఐదు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లాగే మహారాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలు పునరావృతం అవుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదంతా పక్కన పెడితే  అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో శివసేన-బీజేపీ పొత్తు కొనసాగుతుందా.. లేక ఆ రెండూ విడివిడిగా ఎన్నికల బరిలోకి దిగుతాయా అనే ప్రశ్న వస్తోంది.లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీ-శివసేన పొత్తు పెట్టుకున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండూ సగం సగం సీట్లలో పోటీచేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ లోక్‌సభ ఎన్నికల్లో లభించిన చారిత్రక విజయం తర్వాత శివసేనకు అన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేమని బీజేపీ స్పష్టం చేసింది.బీజేపీలోని ఒక వర్గం తమ పార్టీ సొంతంగా మెజారిటీ స్థానాలు గెలుచుకోగలదని చెబుతోంది. అయితే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాత్రం పదేపదే పొత్తు గురించి మాట్లాడుతున్నారు.

ఇక మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లను బీజేపీ-శివసేన పంచుకోవడం అత్యంత క్లిష్టమైన వ్యవహారమని ఆ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. మిత్ర పక్షాలైన బీజేపీ-శివసేన మధ్య సీట్ల పంపకాలు భారత్‌-పాక్‌ విభజన సమస్య కన్నా కష్టతరమైనదని ఆయన అభివర్ణించారు. ఈ క్లిష్టతరమైన సీట్ల పంపకాలపై త్వరలో రెండు పార్టీలు తుది నిర్ణయానికి వస్తాయని వెల్లడించారు.

”సీట్ల పంపకాల విషయంలో రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలు వచ్చాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదు. ఇరు పార్టీల అగ్ర నేతలు దీనిపై చర్చలు జరుపుతున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా త్వరలోనే మీడియాకు వెల్లడిస్తాం.” అని సంజయ్‌ రౌత్‌ అన్నారు.

సోమవారం రాత్రి సీట్ల విషయంలో బీజేపీ-శివసేన నేతల మధ్య జరిగిన చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని శివసేన వర్గాలు తెలిపాయి. 10 సీట్ల విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నట్లు వారు చెప్పారు. మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉన్నా, సీట్ల సంఖ్యపై స్పష్టత లేనందున దాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర శాసనసభలో బీజేపీకు 122 సీట్లు, శివసేనకు 63 స్థానాలు ఉన్నాయి. శివసేన ఎన్డీయేలోనే ఉన్నా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి మొత్తం 48 స్థానాల్లో 41 సీట్లను కైవసం చేసుకుంది. శాసనసభ ఎన్నికలు మహారాష్ట్రలో అక్టోబరు 21న జరగనున్న సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు అదే నెల 24న జరగనుంది.

గత ఐదేళ్లలో ఏం జరిగింది?

శివసేన-బీజేపీ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఆ రెండు పార్టీలు ఎప్పుడూ గొడవలతో వార్తల్లో నిలుస్తూ వచ్చాయి.శివసేన ప్రభుత్వంలో భాగం కాలేదు. కానీ బీజేపీ రాజకీయ, ఆర్థిక విధానాలను తప్పుబడుతూ ఎప్పుడూ దూకుడు చూపించేది. బహుశా విపక్షాలు కూడా అంతగా వ్యతిరేకించ లేకపోయాయి.నోట్లరద్దు అయినా, ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్‌ అయినా, ముంబయి మెట్రో ఆరే కార్‌షెడ్‌పై నిరసనలు అయినా… శివసేన చాలాసార్లు బీజేపీని వ్యతిరేకిస్తూ కనిపించింది.

గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో బీజేపీ-శివసేన విజయం సాధించాయి. అవి పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలైనా శివసేన-బీజేపీ విడివిడిగా పోటీచేశాయి. కానీ, విపక్షాలకు మాత్రం ఎలాంటి అవకాశం దక్కలేదు.ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో రెండింటి మధ్యా గట్టిపోటీ నెలకొంది. ఎన్నో ఏళ్ల నుంచి శివసేన చేతుల్లో ఉన్న ముంబయి ఆ పార్టీ చేజారుతుందేమో అనిపించింది. కానీ ఇద్దరు కార్పొరేటర్ల మెజారిటీతో శివసేన మరోసారి ముంబయిని సొంతం చేసుకుంది. అయితే, ఇన్ని గొడవలు వచ్చినా ప్రభుత్వంలో కొనసాగుతూనే వచ్చింది.

శివసేన.. బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు కూడా చేయడంతో రాజకీయ కలకలం కూడా రేగింది. ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్న రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఏక్‌నాథ్ ఖడ్సే భూకుంభకోణం ఆరోపణలతో రాజీనామా కూడా చేశారు.పంకజ్ ముండే, వినోద్ తావాడే లాంటి మంత్రులపై కూడా విపక్షాలు ఆరోపణలు చేశాయి. కానీ వారి పదవులకు మాత్రం ఎలాంటి ప్రమాదం రాలేదు.

 

Related Tags