టిక్‌టాక్‌లో మరో ప్రాణాంతక గేమ్..
గేమింగ్ ఎడిక్షన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. గతంలో వచ్చిన బ్లూ వేల్, సినామన్ చాలెంజ్, ఫైవ్ ఫింగర్ ఫిల్లెట్, సాల్ట్ అండ్ ఐస్ చాలెంజ్, ఐస్ బకెట్, కికి ఛాలెంజ్ ఇలా రకరకాల ఛాలెంజ్‌లు టీనేజర్లను బాగా ఆకట్టుకున్నాయి. సోషల్

ప్రస్తుతమంతా గేమింగ్ ట్రెండ్ కొనసాగుతోంది. గేమింగ్ ఎడిక్షన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. గతంలో వచ్చిన బ్లూ వేల్, సినామన్ చాలెంజ్, ఫైవ్ ఫింగర్ ఫిల్లెట్, సాల్ట్ అండ్ ఐస్ చాలెంజ్, ఐస్ బకెట్, కికి ఛాలెంజ్ ఇలా రకరకాల ఛాలెంజ్‌లు టీనేజర్లను బాగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఇటువంటి గేమ్స్‌తో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. తాజాగా ఈ పైత్యం టిక్‌టాక్‌ను తాకింది.
కొన్ని రోజుల క్రితం ‘ట్రిప్పింగ్ జంప్’ అనే ఛాలెంజ్ టిక్‌టాక్‌లో హల్‌చల్ చేసింది. ఈ ఛాలెంజ్ కారణంగా చాలా మంది గాయపడ్డారు. ఇప్పటివరకు ఉన్న చాలెంజ్‌లు సరిపోవని టిక్‌టాక్‌లో మరో కొత్త చాలెంజ్ వచ్చి చేరింది. దీనివల్ల కాలక్షేపం మాట అటుంచితే, ఏరికోరి ప్రమాదాలను తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకీ ఏంటా కొత్త చాలెంజ్ అనుకుంటున్నారా..?
తాజాగా టిక్‌టాక్‌లో చేరిన మరో కొత్త ఛాలెంజ్ ‘సాల్ట్ చాలెంజ్’. ఉప్పు డబ్బా తీసుకుని నోరు నిండా గుమ్మరించుకోవడమే ఈ ఛాలెంజ్. జొనాథన్ అనే టిక్‌టాక్ యూజర్ ఈ చాలెంజ్‌ను మొదటిసారి చేశాడు. ప్రస్తుతం ఈ చాలెంజ్ టిక్‌టాక్‌లో వైరల్ అవుతోంది. అయితే ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం శరీరానికి మంచిదంటున్నారు వైద్యులు. రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇటువంటి ప్రాణాంతక చాలెంజ్‌లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
[svt-event date=”05/03/2020,3:51PM” class=”svt-cd-green” ]
[/svt-event]