సుజిత్ ఇంటర్నేషనల్ డైరక్టర్ అవుతాడేమో…

Saaho pre-release event: Sujeeth will become International director Says Prabhas, సుజిత్ ఇంటర్నేషనల్ డైరక్టర్ అవుతాడేమో…

ప్రభాస్ హీరోగా, శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా బాలీవుడ్, కోలీవుడ్ నటులతో కూడిన భారీ బడ్జెట్ సినిమాగా వస్తున్న “సాహో” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో సినిమా దర్శకుడు సుజిత్ మీద ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించాడు. సాహో సినిమా కథ చెప్పడానికి నిక్కర్ వేసుకుని వచ్చాడంటూ చెప్పుకొచ్చాడు. 22 ఏళ్ల వయసుకే సినిమాను డైరెక్ట్ చేసిన సుజిత్.. సినిమా షూటింగ్‌కు ముందు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాడని, సినిమా కోసం సుమారు నాలుగేళ్లు కష్టపడ్డాడన్నారు. పెద్ద పెద్ద టెక్నీషియన్స్‌ను ఎలా వ్యవహరిస్తాడోనని భయపడ్డానని.. కానీ వారితో సుజిత్ కలిసిపోయిన తీరు చూసి ముచ్చటేసిందన్నారు. సుజిత్‌ను చూస్తుంటే గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిపోతాడేమోనని డౌట్ వస్తుందని.. ఇంటర్నేషనల్ డైరెక్టర్ అవుతాడేమోనని ప్రభాస్ అన్నాడు. ఈ వ్యాఖ్యలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ హోరెత్తిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *