ఆర్ఆర్ఆర్ః ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..!

కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్ పడగా.. మిగిలిన పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు దర్శకులు. టెక్నాలజీని ఉపయోగించుకొని వీడియో కాల్స్‌ ద్వారా తమ పనిని కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే షూటింగ్‌లను పూర్తి చేసుకున్న వారు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించేయగా.. కొంత భాగం షూటింగ్‌ జరిగిన చిత్రాలకు ఎడిటింగ్‌ను ప్రారంభించేశారు దర్శకులు. ఇక షూటింగ్‌కు సిద్ధమైన మరికొంత దర్శకులు మ్యూజిక్‌ చేయించుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ లాక్‌డౌన్ బ్రేక్‌ను బాగా […]

ఆర్ఆర్ఆర్ః ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..!
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2020 | 8:05 PM

కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్ పడగా.. మిగిలిన పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు దర్శకులు. టెక్నాలజీని ఉపయోగించుకొని వీడియో కాల్స్‌ ద్వారా తమ పనిని కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే షూటింగ్‌లను పూర్తి చేసుకున్న వారు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించేయగా.. కొంత భాగం షూటింగ్‌ జరిగిన చిత్రాలకు ఎడిటింగ్‌ను ప్రారంభించేశారు దర్శకులు. ఇక షూటింగ్‌కు సిద్ధమైన మరికొంత దర్శకులు మ్యూజిక్‌ చేయించుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ లాక్‌డౌన్ బ్రేక్‌ను బాగా వాడుకుంటోన్న జక్కన్న.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ అనే స్పెషల్ వీడియోను విడుదల చేసిన రాజమౌళి.. వచ్చే నెలలో రాబోతున్న ఎన్టీఆర్ బర్త్‌డే కోసం అలాంటి వీడియోనే చేయాలని ఆలోచిస్తున్నారట. ‘అల్లూరి ఫర్‌ కొమరం’ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేయాలనుకుంటోన్న జక్కన్న.. ఇప్పుడు ఆ పనులను ప్రారంభించినట్లు టాక్. ఎన్టీఆర్‌ పుట్టినరోజుకు 45 రోజులకు పైగా సమయం ఉంది కాబట్టి.. ఇప్పటి నుంచి పనులను స్టార్ట్ చేసినా.. ఆ రోజుకు మోషన్ పోస్టర్ విడుదల చేయొచ్చని ఆర్ఆర్ఆర్ టీమ్ భావిస్తోందట. కాగా ఇటీవల అజయ్‌ దేవగన్ పుట్టినరోజు సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయాలనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయామని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో చెర్రీ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలివియా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా.. పలు భారతీయ భాషల్లో వచ్చే ఏడాది ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Read This Story Also: ఆయనకు ఎన్నో లేఖలు రాశా.. ఓ మంచి రోజు బయటపెడతా..!

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో