అదే నిజమైతే… రవిశాస్త్రి నియామకాన్ని మళ్లీ చేపట్టే అవకాశం!

భారత క్రికెట్‌ని కుదిపేస్తున్న విరుద్ధ ప్రయోజనాల సెగ టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రిని కూడా తాకేలా కనిపిస్తోంది. క్రికెట్ సలహా కమిటీ సభ్యులు కపిల్‌దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలు విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని ఇటీవల ఫిర్యాదు అందడంతో వారికి బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ శనివారం నోటీసులు పంపారు. ఇటీవల ఈ క్రికెట్ సలహా కమిటీ ప్రతిపాదన మేరకే భారత్ హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. దీంతో.. తాజాగా ఆ కమిటీకి […]

అదే నిజమైతే... రవిశాస్త్రి నియామకాన్ని మళ్లీ చేపట్టే అవకాశం!
Follow us

| Edited By:

Updated on: Sep 29, 2019 | 5:46 PM

భారత క్రికెట్‌ని కుదిపేస్తున్న విరుద్ధ ప్రయోజనాల సెగ టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రిని కూడా తాకేలా కనిపిస్తోంది. క్రికెట్ సలహా కమిటీ సభ్యులు కపిల్‌దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలు విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని ఇటీవల ఫిర్యాదు అందడంతో వారికి బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ శనివారం నోటీసులు పంపారు. ఇటీవల ఈ క్రికెట్ సలహా కమిటీ ప్రతిపాదన మేరకే భారత్ హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. దీంతో.. తాజాగా ఆ కమిటీకి విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని తేలడంతో రవిశాస్త్రి నియామకం చెల్లదనే వార్తలు వినిపిస్తున్నాయి.

సీఏసీ సభ్యులు విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నారని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన సంజీవ్‌ గుప్తా బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ డీకే జైన్‌కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో డీకే జైన్‌ శనివారం సీఏసీ సభ్యులకు నోటీసులు పంపారు. దీంతో రవిశాస్త్రి అంశం తెరపైకి వచ్చింది. అయితే కపిల్ కమిటీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తే.. రవిశాస్త్రి తన పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో రవిశాస్త్రి నియమకాన్ని మళ్లీ చేపట్టే అవకాశం ఉంది.

బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ… ‘సీఏసీ సభ్యులు విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నారని తేలితే మాత్రం రవిశాస్త్రి అనవసరంగా ఈ వివాదంలో చిక్కుకుంటాడు. శాస్త్రి ఎంపిక ప్రక్రియను తిరిగి చేపట్టాల్సి ఉంటుంది. బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం సీఏసీ సభ్యులు మాత్రమే టీమిండియా కోచ్‌ని ఎంపిక చెయ్యాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుత సభ్యులు విరుద్ధ ప్రయోజనాలు పొందితే.. కొత్తగా ఏర్పడే క్రికెట్‌ సలహా కమిటి తిరిగి కోచ్‌ ఎన్నుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నాడు. గతేడాది తాత్కాలిక సభ్యులుగా ఉన్న కపిల్‌ కమిటీ మహిళా జట్టు కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ని సైతం ఎంపిక చేశారు. దీంతో రామన్‌ సైతం ఈ వివాదంలోకి రానున్నాడు.

ప్రధాన కోచ్‌ను సీఏసీ ఎంపిక చేయడంపై సీఓఏలో భిన్న వాదనలు వినిపించాయి. సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ ప్రధాన కోచ్‌ ఎంపిక పూర్తిగా కపిల్‌ కమిటీనే చూసుకుంటుందని చెప్పగా.. ఎడ్జుల్లీ మాత్రం విభేదించారు. ఇది బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం చెల్లదన్నారు. చివరకు సీఏసీనే ప్రధాన కోచ్‌ ఎంపికను చేపట్టింది. ఇప్పుడు విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చింది. మరోవైపు డీకే జైన్‌ ఎథిక్స్‌ ఆఫీసర్‌గా నియామకం జరిగిన తర్వాత కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Latest Articles
చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ రద్దు.. మళ్లీ పోలింగ్‌ ఎ
చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ రద్దు.. మళ్లీ పోలింగ్‌ ఎ
దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! లక్షణాలు ఇవే
దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! లక్షణాలు ఇవే
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర
మరో పేద రైతుకు ట్రాక్టర్‌ను అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
మరో పేద రైతుకు ట్రాక్టర్‌ను అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
ఉదయాన్నే వీటిని చూడటం చాలా శుభప్రదం..రోజంతా హాయిగా సాగిపోతుంది
ఉదయాన్నే వీటిని చూడటం చాలా శుభప్రదం..రోజంతా హాయిగా సాగిపోతుంది
హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?
హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!