Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ లేఖ రాసింది నేనే: రమేష్ కుమార్ క్లారిటీ..!

కేంద్ర హోంశాఖకు రాసిన లేఖపై ఎట్టకేలకు ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పందించారు. ఆ లేఖ తానే రాశానని ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు రమేష్ కుమార్. గత కొద్దిరోజులుగా ఈ లేఖపై రాజకీయ దుమారం కొనసాగుతుండగా.. తాజాగా ఆయన స్పందించారు.

ఆ లేఖ రాసింది నేనే: రమేష్ కుమార్ క్లారిటీ..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 15, 2020 | 9:39 PM

కేంద్ర హోంశాఖకు రాసిన లేఖపై ఎట్టకేలకు ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పందించారు. ఆ లేఖ తానే రాశానని ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు రమేష్ కుమార్. గత కొద్దిరోజులుగా ఈ లేఖపై రాజకీయ దుమారం కొనసాగుతుండగా.. తాజాగా ఆయన స్పందించారు. కాగా రమేష్ కుమార్ రాసిన లేఖపై అనుమానాలున్నాయని.. దానిపై విచారణ జరపాలని ఏపీ డీజీపీకి విజయసాయి రెడ్డి ఇవాళ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖ రాసి కొన్ని గంటలు కూడా గడవకముందే రమేష్ కుమార్ స్పందించడం గమనర్హం.

కాగా కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్. ఆ తరువాత కొద్ది రోజులకు జగన్ ప్రభుత్వంపై ఆయన కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అందులో ఎన్నికలను వాయిదా వేసిన తరువాత తనను సీఎం జగన్ బెదిరించేలా మాట్లాడారని, మంత్రులందరూ వంతులవారీగా తనపై ఆరోపణలు గుప్పించారని వాపోయారు. చివరికి స్పీకర్‌ సైతం తనపై తీవ్ర స్థాయిలో మాటల దాడి చేశారని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు తొలివిడత జరిగిన ఎన్నికల్లో హింస జరిగిందని.. కడప జిల్లాలో చాలా ఏకగ్రీవాల జరిగాయని అందులో వెల్లడించారు. తనకే కాదు.. తన కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని రమేష్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని.. ప్రస్తుతమైతే హైదరాబాద్‌ నుంచే విధులు నిర్వహిస్తానని తెలిపారు.

Read This Story Also: Breaking: కేంద్ర ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ స్పాట్ జిల్లాలివే..!

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌