నయా ట్రెండ్ సెట్ చేసిన రకుల్, ముద్దుగుమ్మలకు భలే దారి చూపించింది

కోలీవుడ్‌లో కన్నడ బ్యూటీకి డబుల్ ధమాకా.. అనే వార్త మొన్నటిదాకా మీడియాలో తెగ సర్కులేట్ అయ్యింది. కార్తీతో సుల్తాన్ మూవీ సెట్స్‌పై వుండగానే,

  • Ram Naramaneni
  • Publish Date - 4:03 pm, Fri, 27 November 20
నయా ట్రెండ్ సెట్ చేసిన రకుల్, ముద్దుగుమ్మలకు భలే దారి చూపించింది

కోలీవుడ్‌లో కన్నడ బ్యూటీకి డబుల్ ధమాకా.. అనే వార్త మొన్నటిదాకా మీడియాలో తెగ సర్కులేట్ అయ్యింది. కార్తీతో సుల్తాన్ మూవీ సెట్స్‌పై వుండగానే, సూర్యతో ఇంకో సినిమా ఓకే అయ్యిందన్నది ఆ వార్త సారాంశం. ఐతే.. అదంతా తూచ్.. రష్మిక పేరే మా దగ్గర లేదు అని సీరియస్‌గా కొట్టిపారేశారు డైరెక్టర్ పాండిరాజ్. ఇలా ఇప్పుడు కొన్ని వార్తలు నటీమణుల నెట్టింట్లో వైరలవుతున్నాయి.

మెగామూవీ ఆచార్యలో కూడా రష్మిక సెట్ అయిందన్నారు. అందులో నిజమెంతో ఎవ్వరికీ తెలీదు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సమంత గురించి కూడా ఇటువంటి లీక్స్ బోలెడన్ని వచ్చేశాయి. కానీ.. ఆ బేబీ మాత్రం ముందుకొచ్చి ఇవీ నా ఫ్యూచర్ మూవీస్ అని ఎక్కడా చెప్పలేదు. ఇటువంటి మతలబులన్నీ హీరోయిన్లకి కొత్త తంటాలు తెచ్చిపెడ్తున్నాయి. నిశ్శబ్దం తర్వాత ఖాళీగా వున్న అనుష్క విషయంలో ఈ గందరగోళం మరీ ఎక్కువ. గౌతమ్‌మీనన్‌తో ఒక సినిమా చేస్తున్నారన్న వార్తే గాని.. వాస్తవం మాత్రం బైటికి రాలేదు. సర్కారువారి పాటలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు మొన్న హీరో మహేష్‌బాబు ట్వీట్‌ చేసేదాకా మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. వకీల్‌సాబ్‌ మూవీలో పవర్‌స్టార్‌తో శృతిహాసన్‌ నటిస్తారన్న న్యూస్ కూడా డైరెక్టరే ఆఫ్‌సైడ్‌ చెప్పుకోవాల్సిన పరిస్థితి.

ఇటువంటి కన్‌ఫ్యూజన్‌లకు చెక్ పెట్టాలన్న ఆలోచన ఫస్ట్‌టైమ్ చేశారు రకుల్ ప్రీత్ సింగ్‌. మోహన్‌బాబు మూవీ సన్‌ఆఫ్ ఇండియాలో తాను ఒక రోల్ చేస్తున్నానన్న వార్త.. ఆమె దీమాక్‌ని ఖరాబు చేసిందట. అందుకే.. తాను చేస్తున్న సినిమాలు ఇవీ అంటూ క్లారిటీ ఇచ్చి.. ఒక ట్రెండ్ సెట్ చేశారు రకుల్. మిగతా హీరోయిన్లు కూడా ఇటువంటిదే శ్వేతపత్రం ఒకటి రాసిస్తే పోలా అనే సూచన నెటిజన్ల నుంచి వినిపిస్తోంది.

Also Read :

నేడు ఏపీ కేబినెట్ భేటీ, సభలో పెట్టే బిల్లులపై చర్చ, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక నిర్ణయం

ఏపీలో 53 మంది మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు, అలా చేస్తే ఆర్డర్స్ రద్దు