ఇది దక్షిణాది..ఇక్కడ ‘హిందీ’ అంటే నడవదు

తమిళులు ఏమైనా సహిస్తారు గానీ తమ ఆత్మగౌరవం జోలికి వస్తే ఉప్పెనగా మారతారు. భాష, సంస్కృతి విషయంలో వారు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారు.  హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన ‘ఒకే దేశం-ఒకే భాష’ వ్యాఖ్యలపై దక్షణాదిలో నిరసన జ్వాలలు రగులుకోగా..తమిళనాడు అవి మరింత ఉద్రిక్తంగా సాగుతున్నాయి. హిందీలో ఉన్న సైన్ బోర్డ్స్‌ ఎక్కడ కనిపించినా..వాటికి తమిళులు నలుపు రంగు పూస్తున్నారు. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు షా ప్రతిపాదనపై […]

ఇది దక్షిణాది..ఇక్కడ 'హిందీ' అంటే నడవదు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 18, 2019 | 4:24 PM

తమిళులు ఏమైనా సహిస్తారు గానీ తమ ఆత్మగౌరవం జోలికి వస్తే ఉప్పెనగా మారతారు. భాష, సంస్కృతి విషయంలో వారు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారు.  హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన ‘ఒకే దేశం-ఒకే భాష’ వ్యాఖ్యలపై దక్షణాదిలో నిరసన జ్వాలలు రగులుకోగా..తమిళనాడు అవి మరింత ఉద్రిక్తంగా సాగుతున్నాయి. హిందీలో ఉన్న సైన్ బోర్డ్స్‌ ఎక్కడ కనిపించినా..వాటికి తమిళులు నలుపు రంగు పూస్తున్నారు. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు షా ప్రతిపాదనపై మండిపడ్డాయి. పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కూడా వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నారు.  తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఈ విషయంపై స్పందించారు. కేంద్రమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలతో ఆయన విభేదించారు. హిందీ భాష అమలు ఎక్కడైనా సాధ్యమవుతోందేమోగానీ దక్షిణ భారత దేశంలో సాధ్యం కాని పని అని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ తమిళనాడు ప్రజలు, దక్షిణాదిలో హిందీని అంగీకరించరు. దేశమంతటా ఒకే భాష ఉండటం దేశాభివృద్ధికి మంచిదే కావచ్చు. కానీ, మన దేశంలో ఒకే భాష లేదు కదా. ఉత్తర భారతీయులు కూడా ఒకే భాష విధానాన్ని అభినందించరు. కాబట్టి ఒకే భాషను బలవంతంగా రుద్దడం సాధ్యం కాదు’ అని రజనీ అన్నారు.

కాగా ఇదే విషయంపై గతంలో కమల్ హాసన్ కూడా స్పందించారు. . ‘ఏ షా, సామ్రాట్, సుల్తాన్ కూడా దేశ ఐక్యతను దెబ్బతీయలేరు’ అని వ్యాఖ్యానించారు. దీని వల్ల చాలా మంది బాధపడాల్సి ఉంటుందని హెచ్చరించారు. హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే దానిపై భారీ ఉద్యమం జరుగుతుందన్నారు. జల్లికట్టు అనేది కేవలం శాంపిల్ మాత్రమేనని, దానికంటే పెద్ద ఉద్యమం జరుగుతుందని కమల్ హాసన్ వార్నింగ్ ఇచ్చారు. మరో నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా కేంద్రమంత్రి వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ వాదం పేరుతో ఒకేమతం-ఒకే భాష తెరపైకి తెచ్చారని, తర్వాత ఏంటని తీవ్రంగా స్పందించారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో