పూరీ దగ్గర అసిస్టెంట్‌గా చేరాలనుకున్న జక్కన్న.. ఎందుకంటే..!

దర్శకధీరుడు రాజమౌళి, డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్.. ఈ ఇద్దరికి టాలీవుడ్‌లో ఎవరి గుర్తింపు వారికి ఉంది. టాప్ దర్శకుల్లో ఈ ఇద్దరి పేరు కచ్చితంగా ఉంటుంది.

పూరీ దగ్గర అసిస్టెంట్‌గా చేరాలనుకున్న జక్కన్న.. ఎందుకంటే..!
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 10:03 PM

దర్శకధీరుడు రాజమౌళి, డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్.. ఈ ఇద్దరికి టాలీవుడ్‌లో ఎవరి గుర్తింపు వారికి ఉంది. టాప్ దర్శకుల్లో ఈ ఇద్దరి పేరు కచ్చితంగా ఉంటుంది. అంతేకాదు డైరెక్టర్లుగా దాదాపుగా ఒకేసారి ఈ ఇద్దరు కెరీర్‌ను ప్రారంభించారు. అయితే తొందరగా సినిమాలు చేసే అలవాటున్న పూరీ.. ఇప్పటికే 34 చిత్రాలను పూర్తి చేయగా.. రాజమౌళి మాత్రం పదకొండు మూవీలను కంప్లీట్ చేశారు. ఇదిలా ఉంటే ఓ సమయంలో పూరీ దగ్గర అసిస్టెంట్‌గా చేరాలనుందని జక్కన్న తన మనసులోని మాటను చెప్పారు.

కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ.. డ్యాషింగ్ డైరక్టర్‌పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం డైలాగ్‌లతో సినిమాను హిట్ చేయగల సత్తా పూరీకి మాత్రమే ఉంది. త్వరగా సినిమాను ఎలా పూర్తి చేయాలో పూరీని చూసి నేర్చుకోవాలని నా భార్య నా మీద ఎప్పుడూ జోకులు చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు పూర దగ్గర అసిస్టెంట్‌గా మారాలనుకుంటున్నా. మేము కొన్ని సంవత్సరాలు కష్టపడి ఓ బ్లాక్‌బస్టర్ హిట్‌ను తెరకెక్కిస్తాం. కానీ ప్రతి సంవత్సరం పూరీ ఓ ఇండస్ట్రీ హిట్ ఇస్తుంటారు అని రాజమౌళి చెప్పారు. కాగా రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కిస్తుండగా.. పూరీ, విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Read This Story Also: యంగ్ డైరక్టర్ సవాల్‌ని స్వీకరించిన జక్కన్న..!

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో