Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 26 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 226770. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 110960. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 109462. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6348. . కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • 10 వ తరగతి పరీక్షలపై విచారణను మళ్లీ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు. కంటైన్మెంట్ జోన్లో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటిని ప్రశ్నించిన హైకోర్టు. సప్లిమెంటరీ లో పాస్ అయితే రెగ్యులర్ విద్యార్థులు గా గుర్తిస్తారా అన్న హైకోర్టు. 10 వ తరగతి పరీక్షలు ఇప్పుడు రాసిన విద్యార్థులను సప్లిమెంటరీ అనుమతి ఇస్తామన్న ప్రభుత్వం. ప్రభుత్వాన్ని సంప్రదించి రేపు తమ నిర్ణయం చెబుతామన్న అడ్వకేట్ జనరల్ రేపు కంటైన్మెంట్ జోన్లు, సప్లిమెంటరీ పై పూర్తి వివరాలను తెలియజేయాలని ప్రభుత్వంకు హైకోర్టు అదేశం.
  • అండర్ వరల్డ్ డాన్ ని కూడా వదలని కరోనా. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కి కరోనా పాజిటివ్. దావుద్ తో పాటు అతని భార్య కి కూడా కరోనా పాజిటివ్. అతని సిబ్బంది మొత్తం క్వారం టైన్ అయినట్లు సమాచారం .
  • చేప ప్రసాదం పై టివి9 తో బత్తిని హరినాథ్ గౌడ్. 173 ఏళ్లుగా ఈ ప్రసాదాన్ని పంపిణీకి కరోనా బ్రేక్. ఈ ఏడాది చేప ప్రసాదం తయారు చేస్తాం. కానీ పంపిణీ ఉండదు. చేపప్రసాదానికి ప్రత్యామ్నాయంగా అలోపతి వాడొద్దు. కేవలం తమ కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తాం. ప్రభుత్వ ఆదేశాలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ రద్దు చేసుకున్నాం. చేప ప్రసాదం పేరుతో ఎవరైనా పంపిణీ ఉందని చెబితే మోసపోవద్దు. ఇలా ప్రచారంచేస్తే పోలీసు శాఖకు ఫిర్యాదు చేయండి.
  • టిటిడి ఏఈవో ధర్మారెడ్డి కామెంట్స్. ఇతర రాష్ట్రాలతో ఉన్నవారు..ఆన్ లైన్లో తిరుమల దర్శన టికెట్ తీసుకున్నప్పటికీ..ఆ టికెట్..రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఎంట్రీకి పనికిరాదు. వేరే రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చిన సూచనల మేరకు పాసులు తీసుకోవాలి. వీఐపీ బ్రేక్ దర్శనాలు సిఫార్స్ లేఖలు అనుమతించేది లేదు. ఎవరినీ దర్శనాలకి ఎవరికీ రికమండే షన్ పత్రాలు ఇవ్వొద్దు. ఎవరైతే వీఐపీలు ఉన్నారో వారికి మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకి అనుమతిస్తాము.
  • టివి9 తో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్. ఇక మీదట రోడ్డు రవాణా సేవలన్నీ...ఆన్ లైన్ లోనే. ముందుగా 17 సర్వీసులు ఆన్లైన్ లోనికి . మరో 30 సర్వీసులను ఆన్లైన్ చేయడం కోసం ప్రయత్నాలు . ఈనెల 20 తర్వాత ఆన్లైన్ సేవలు అందుబాటులోనికి వచ్చేఅవకాశం. ఆన్ లైన్ సేవల్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, వాహనాల డాక్యుమెంట్ల నకళ్లు, వాహనాల పర్మిట్లు వంటివి. ఆన్లైన్ సేవల ద్వారా ఆర్టీఏ దళారులకు చెక్ . ఆన్లైన్ సేవలుతో నేరుగా ఇంటికే ధ్రువపత్రాలు .

బ్రదర్..జగన్‌ని అభిమానిస్తాం : పీపుల్ స్టార్

R Narayana Murthy Visit to West Godavari District, బ్రదర్..జగన్‌ని అభిమానిస్తాం : పీపుల్ స్టార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా కానీ తాము అభిమానిస్తామన్నారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, గత కొద్దిరోజుల నుండి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఎన్నికవడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరికి ఇష్టం లేదంటూ ఆ పార్టీ నేత, నటుడు పృథ్వీ  కామెంట్స్ చేశారు. ఈ విషయంపై ఫిల్మ్ ఇండస్ట్రీలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు నారాయణ మూర్తి ముందు ప్రస్తావించగా.. దీనికి ఆయన సమాధానం ఇస్తూ ఏపీకి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా అభిమానిస్తామని చెప్పారు. ప్రస్తుతం జగన్ గారు సీఎంగా ఉన్న నేపథ్యంలో ఆయనను కూడా గౌరవిస్తామన్నారు. సినీ పరిశ్రమకు రాజకీయాలతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తేడాలుండవని… ఉత్తరాంధ్రకు గోదావరి జలా తరలింపు వల్ల ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

Related Tags