Breaking News
  • పెటాకులు దిశగా Facebook పెళ్లి. నందవరం లో భర్త ఇంటిముందు ధర్నా చేపట్టిన భార్య అనూష. ఫెస్ బుక్ లో మూడు నెలల క్రితం పరిచయం అయిన రాకేష్. జులై 4 వ తేదీ హైదరాబాద్ లో వివాహం చేసుకున్న రాకేష్, అనూష. వివాహం అయ్యాక 4 రోజులు ఉండి తిరిగి నందవరం కు వచ్చిన రాకేష్. హైదరాబాద్ కు రాకేష్ రాకపోవడంతో నందవరం కు వచ్చి రాకేష్ ఇంటి ముందు ఆందోళన చేపట్టిన అనూష. బాధితురాలికి న్యాయం చేయాలి అంటూ మద్దతు తెలిపిన మహిళ సంఘాలు.
  • కోషెర్ ఫార్మా కంపెనీ పేరు తో తిరుపతి రెడ్డి మోసాలు . సిద్దిపేట జిల్లా జగదేవపూర్ విలేజ్ లో కోషెర్ ఫార్మా కంపెనీ . ప్రభుత్వ ముఖ్య వ్యక్తుల పేర్లు చెప్పి కోట్లు వసూల్ చేసిన తిరుపతి రెడ్డి జగదేవపూర్ లో ఫార్మా కంపెనీ లో పెట్టుబడులు పెట్టిన ప్రైవేట్ వ్యక్తులు. ముంబై కి చెందిన కన్సల్టెంట్ లతో ప్రభుత్వా నికి చెందిన పెద్దల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డ తిరుపతి రెడ్డి. అధికార పార్టీ నేతల పేర్లు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసిన తిరుపతి రెడ్డి. పాట్నార్లకి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి బాధితుల్లో మాజీ మంత్రి సంతోష్ రెడ్డి కూతురు లావణ్య రెడ్డి.
  • సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసు .. విశాఖలోనే సృష్టిపై 4 కేసులు. పోలీస్ కస్టడీలో ఎ1 డాక్టర్ నమ్రత. రెండో రోజు డాక్టర్ నమ్రతను విచారించనున్న పోలీసులు. తొలిరోజు విచారణలో నమ్రత పొంతనలేని సమాధానాలు. ఇప్లటికే ఈ కేసులో ముగ్గురు డాక్టర్లు.. 2 ఆసుపత్రుల పాత్ర.. 8 మంది అరెస్ట్. సృష్టితో లింకులున్న మరిన్ని ఆసుపత్రులపైనా పోలీసుల ఆరా. కేసు దర్యాప్తులో ఆరోగ్యశాఖ, స్త్రీశిశు సంక్శేమ అధికారులు, చైల్డ్ లైన్ అధికారులను భాగస్వామ్యం చేసే యోచనలో పోలీసులు. ఇప్పటికే ఇద్దరు డీసీపీలు, 3 ఏసీపీలతో సృష్టి కేసు విచారణ. 2017 నుంచి 63 ప్రసవాలు జరిగినట్యు నొర్ధారణ. సరోగసి ద్వారా పుట్టినట్టు చెబుతున్న చిన్నారుకు ఎక్కెడెక్కడున్నారన్న దానిపై కూపీ లాగితున్న పోలీసులు . విజయనగరం దంపతుల వద్ద ఉన్న చిన్నారిని సీడబ్ల్యూసీ ముందు హాజరుపరచనున్న పోలీసులు.
  • సుశాంత్ కేసులో సిద్ధార్థ పితాని కి ఈడి నోటీసులు.. తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు పంపిన ముంబై ఈడి. సుశాంత్ మరణం తర్వాత పోలీసులు అనుమతి తో హైదరాబాద్ చేరుకున్న సిద్ధార్థ. సుశాంత తో కలిసి కొన్నాళ్ళపాటు అదే ఇంట్లో ఉన్న సిద్ధార్థ పితాని. సుశాంత్ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయనున్న ట్లుగా గా తెలిపిన ఈ డి. సుశాంత్ కు క్రియేట్ మేనేజర్గా పని చేసిన సిద్ధార్థ. సుశాంత్ ప్రియురాలు రియా కు 15 కోట్లు వ్యవహారంపై ఆరా. రియా కు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పాలంటూ ఇప్పటికే సిద్ధార్థ కు ఫోన్ కాల్స్. తనకు వచ్చిన ఫోన్ కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సిద్ధార్థ.
  • కోషెర్ ఫార్మా కంపెనీ పేరు తో తిరుపతి రెడ్డి మోసాలు . సిద్దిపేట జిల్లా జగదేవపూర్ విలేజ్ లో కోషెర్ ఫార్మా కంపెనీ . ప్రభుత్వ ముఖ్య వ్యక్తుల పేర్లు చెప్పి కోట్లు వసూల్ చేసిన తిరుపతి రెడ్డి . జగదేవపూర్ లో ఫార్మా కంపెనీ లో పెట్టుబడులు పెట్టిన ప్రైవేట్ వ్యక్తులు. ముంబై కి చెందిన కన్సల్టెంట్ లతో ప్రభుత్వా నికి చెందిన పెద్దల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డ తిరుపతి రెడ్డి. అధికార పార్టీ నేతల పేర్లు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసిన తిరుపతి రెడ్డి. పాట్నార్లకి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి బాధితుల్లో మాజీ మంత్రి సంతోష్ రెడ్డి కూతురు లావణ్య రెడ్డి.
  • తు.గో జిల్లా... రాజమండ్రి సెంట్రల్ జైలు లో కరోనా కలకలం. తాజా గా 983 మందికి టెస్టులు చేయగా 254 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. సెంట్రల్ జైలు లో ఉన్న 12 మంది సిబ్బందికి సోకిన కరోనా పాజిటివ్. సెంట్రల్ జైలు లో మొత్తం 1666 మంది ఖైదీలు. కరోన సోకిన ఖైదీలకు జైలు లో ఉన్న న్యూ సీపీ బ్లాక్ లో ప్రత్యేక కోవిడ్ చికిత్స. ఇంకా 300 మంది ఖైదీల పరీక్షల రిపోర్స్ రావాల్సి ఉంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జైల్ లో మూలాఖత్ నీపివేసిన అధికారులు. జైల్ లో అడ్మినిస్ర్టేషన్, డాక్టర్ ద్వారా సోకిన కరోన కేసులు.
  • తెలంగాణ కరోనా కేసుల అప్డేట్స్: తెలంగాణ లో కరోనా టెస్టింగ్స్ : 5,66,984. ఈ ఒక్కరోజే టెస్టింగ్స్: 23,495. రాష్ట్రంలో ఈరోజు పాజిటివ్ కేసులు : 2207. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు : 75,257. జిహెచ్ఎంసి లో ఈరోజు కేసులు: 532. జిహెచ్ఎంసి లో మొత్తం కరోనా కేసులు సంఖ్య : 41,725. కరోనా తో ఈరోజు మరణాలు : 12. ఇప్పటి వరకూ మరణాలు మొత్తం : 601. చికిత్స పొందుతున్న కేసులు : 21,417. ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయిన వారు: 1136. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య: 53,239.
  • రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి విజయలక్ష్మి (74) గుండెపోటు తో మృతి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయలక్ష్మి. హైదరాబాద్ లోని స్వగృహంలో ఈ తెల్లవారుఝామున కన్నుమూశారు.

సానియా మీర్జా పోస్ట్ంగ్స్ పై నెటిజన్లు ఫైర్

, సానియా మీర్జా పోస్ట్ంగ్స్ పై నెటిజన్లు ఫైర్

భారత్, పాక్‌ల మధ్య ఏ చిన్న విషయం జరిగినా… ఆ ప్రభావం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై పడుతుంది. క్రికెట్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయినా… పాక్ చేతిలో భారత్ ఓడినా… సానియా మీర్జాను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలెడతారు నెటిజన్లు. కారణం అందరికీ తెలిసిందే పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా పెళ్లి చేసుకోవడమే. పాక్ దేశస్థుడిని పెళ్లాడిన తర్వాత కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోన్న ఈ టెన్నిస్ స్టార్… మరోసారి సోషల్ మీడియా ట్రోలింగ్ బారిన పడింది. తాజాగా ట్రోలింగ్ కు గురికావడానికి కారణం సోషల్ మీడియాలో తన ఫోటోలు పెట్టడం. ఫోటోలు పెట్టడంలో తప్పులేదు కానీ.. ఓ వైపు పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీరజవాన్లను గుర్తుచేసుకోకుండా.. తన మోడలింగ్ కు సంబంధించిన ఫోటోలను అప్ లోడ్ చేసింది. అంతే.. నెటిజన్లు సానియా తీరుపై దుమ్మెత్తిపోశారు.

 

, సానియా మీర్జా పోస్ట్ంగ్స్ పై నెటిజన్లు ఫైర్

ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది జవాన్లు అమరులైనారు. ఈ దారుణ సంఘటనపై దేశంమొత్తం స్పందిస్తుంటే.. అలాంటి సమయంలో సానియా మీర్జా తనకొత్త డ్రెస్ ను చూపిస్తూ ఇన్ స్టా గ్రాంలో ఫోటో చేసింది. పింక్ అండ్ వైట్ కలర్ లో డిజైన్ చేసిన డ్రెస్ వేసుకుని.. ఫోటోలను పోస్ట్ చేసిన వెంటనే సానియాకు సోషల్ మీడియా ట్రోలింగ్ ఎఫెక్ట్ మొదలైంది. ఓ పక్క దేశంలో దారుణ ఉగ్రదాడి జరిగింది. భారత సైనికులు ప్రాణాలు కోల్పోతే.. దాని గురించి స్పందించకుండా ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తావా అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు.

ట్రోలింగ్ మొదలైన అనంతరం తేరుకున్న సానియామీర్జ.. పుల్వామా ఘటన గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. పుల్వామా ఘటనపై తెలిసి బాధపడ్డా.. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ప్రపంచంలో టెర్రరిజానికి చోటు లేదు… శాంతి కోసం ప్రార్థిస్తున్నా’ అంటూ ట్విట్ చేసింది. అయినా కూడా సానియాను నెటిజన్లు వదల్లేదు. త్వరలోనే పాకిస్థాన్‌ ప్రపంచపటం నుంచి మాయమవుతుంది. నువ్వు, నీ కుటుంబంతో కలిసి ఇండియాలో ఉండొచ్చు అంటూ కామెంట్లు చేశారు.

, సానియా మీర్జా పోస్ట్ంగ్స్ పై నెటిజన్లు ఫైర్

, సానియా మీర్జా పోస్ట్ంగ్స్ పై నెటిజన్లు ఫైర్

 

అయితే సానియా మీర్జాకు ఈ విధమైన ట్రోలింగ్ కొత్తేమీ కాదు. కొన్నాళ్ల కిందట ఇండియా- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సమయంలో ట్రోలింగ్ గురించి ముందే గ్రహించిన సానియా.. తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటినీ డీ-యాక్టివేట్ చేసేసింది. మ్యాచ్ ముగిసిన రెండు రోజుల తర్వాత గానీ రీ-యాక్టివేట్ చేయలేదు.

Related Tags