బీ రెడీ డార్లింగ్స్.. ‘సాహో’ రన్ టైం లాక్!

ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమా ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ చిత్ర ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. యాక్షన్ సన్నివేశాల మేళవింపుతో కట్ చేసిన ట్రైలర్ పూర్తిగా హాలీవుడ్ రేంజ్‌కు తగినట్లు ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి రన్ టైమ్‌ను లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ 1గంట […]

బీ రెడీ డార్లింగ్స్.. 'సాహో' రన్ టైం లాక్!
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 12, 2019 | 2:43 PM

ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమా ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ చిత్ర ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. యాక్షన్ సన్నివేశాల మేళవింపుతో కట్ చేసిన ట్రైలర్ పూర్తిగా హాలీవుడ్ రేంజ్‌కు తగినట్లు ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి రన్ టైమ్‌ను లాక్ చేసినట్టు తెలుస్తోంది.

ఫస్ట్ హాఫ్ 1గంట 24 నిమిషాలు కాగా, సెకండ్ హాఫ్ 1గంట 28 నిముషాలు ఉన్నట్టు తెలుస్తోంది.  మొత్తంగా చూసుకుంటే 8 నిముషాలు తక్కువగా మూడు గంటలు. సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉన్నా.. యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండటంతో.. ఫ్యాన్స్‌కు ఖచ్చితంగా నచ్చుతుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.