YS Sharmila: సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించే స్థితిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేవు.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలు

|

Sep 21, 2021 | 6:08 PM

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీతు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించే స్థితిలో లేవని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం తన పోరు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

YS Sharmila: సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించే స్థితిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేవు.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలు
Ys Sharmila
Follow us on

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించే స్థితిలో లేవని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం తన పోరు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో ఆమె చేపట్టిన నిరుద్యోగ దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. బోడుప్పల్ ద్వారకనగర్‌లో రవీందర్ నాయక్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అనంతరం నిరాహార దీక్ష చేసేందుకు బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వచ్చారు. పోలీసులు స్థలం మార్చుకోవాలని సూచించారు. దీంతో YSRTP కార్యకర్తలు ఆందోళనకు దిగారు. షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు… ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌ తీసుకెళ్లారు. అక్కడినుంచి నేరుగా ఆమె నివాసం లోటస్ పాండ్‌కు తరలించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై షర్మిల విమర్శలు గుప్పించారు. తన నియోజకవర్గంలో నిరుద్యోగి చనిపోతే రేవంత్ రెడ్డి కనీసం పరామర్శించరా? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు..సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించే స్థితిలో లేవన్నారు. ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రతి మంగళవారం నిరుద్యోగులకు మద్దతుగా షర్మిల దీక్ష చేపడుతుండటం తెలిసిందే.

అటు ట్విట్టర్ వేదికగానే ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు షర్మిల.

అడ్డా కూలీల ఆందోళన..

ఇదిలా ఉండగా వైఎస్ షర్మిల దీక్ష కోసం తీసుకొచ్చి డబ్బులు ఇవ్వట్లేదని అడ్డా కూలీలు ఆందోళనకు దిగారు. దీక్షా స్థలి వద్దే నిరసన తెలిపారు. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి తీసుకొచ్చారని ఆరోపించారు. తీర వచ్చాక డబ్బులు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు.

Also Read..

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ దంచికొడుతున్న వానలు.. మరో రెండు రోజులపాటు ఇంతే..

రాజీనామా చేసి గెలిస్తే.. బాబు బూట్లు తుడుస్తా.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి నాని..