
విజయవాడ: బెజవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి ప్రసాద్ వి పొట్లూరి తన పేరుకు కొత్త అర్ధాన్ని చెప్పారు. పీవీపి అంటే ప్రగతి వైపు పరుగు అని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్థానిక శాసనసభ్యుడు కేశినాని నాని, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాలపై విమర్శలు గుప్పించారు. టీడీపీ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం ఆరాటం తప్పితే..ప్రజల సమస్కలు వారికి పట్టవని అన్నారు. 2014లో తాను విజయవాడలో పీవీపి మాల్‌ని నిర్మించి..700 మందికి ఉద్యోగాలు కల్పించానన్నారు. పుట్టిన ఊరి కోసం తన ఏదో ఒకటి చేయాలని ఉందని..ఒక్క అవకాశం ఇస్తే..తనను ఇంతటి వాడ్ని చేసిన నగరానికి సేవ చేస్తానన్నారు. నేను కూడా దిగువ మధ్యతరగతి నుంచి ఎదిగానన్న పీవీపి..పేదవారి సమస్యలు తెలుసన్నారు. కృష్ణా నది పక్కనుంచి పారుతున్నా..మంత్రి ఉమామహేశ్వరరావు తన నియోజకవర్గానికి త్రాగు నీరు ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. నిత్యం రాజకీయాలతో అట్టుడుకుతున్న విజయవాడ సిటీని ఫన్ మోడ్‌లోకి తీసుకువద్ధామని ఆయన పిలుపునిచ్చారు.