విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం

| Edited By:

Mar 27, 2019 | 11:55 AM

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో 90 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయని అన్నారు. ప్రత్యేక విమానాల్లో తమిళనాడు, సీఎం చంద్రబాబు పశ్మిమబెంగాల్‌కు వెళ్తాడు కానీ.. పక్కనే ఉన్న ఒడిశా ముఖ్యమంత్రి దగ్గరకు మాత్రం వెళ్లడని అన్నారు. ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించి విజయనగరం జిల్లా సాగునీటి సమస్యను మాత్రం తీర్చరని చంద్రబాబుపై విమర్శలు చేశారు. విజయనగరం జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువమంది ఉన్నారు. […]

విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్  ఎన్నికల ప్రచారం
Follow us on

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో 90 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయని అన్నారు. ప్రత్యేక విమానాల్లో తమిళనాడు, సీఎం చంద్రబాబు పశ్మిమబెంగాల్‌కు వెళ్తాడు కానీ.. పక్కనే ఉన్న ఒడిశా ముఖ్యమంత్రి దగ్గరకు మాత్రం వెళ్లడని అన్నారు. ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించి విజయనగరం జిల్లా సాగునీటి సమస్యను మాత్రం తీర్చరని చంద్రబాబుపై విమర్శలు చేశారు. విజయనగరం జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువమంది ఉన్నారు. అగ్రీగోల్డ్ ఆస్తులను అమ్మి ప్రజల సమస్యలను తీర్చాల్సింది పోయి.. ఆ ఆస్తులను కాజేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు జగన్.

నా సుదీర్ఘ పాదయాత్రలో ప్రతీ ఒక్కరి కష్టాన్ని చూశాను. గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హెరిటేజ్ కంపెనీ కోసం భూములను లాక్కోని రైతులను చంద్రబాబు నట్టేట ముంచేశారని విమర్శించారు. పిల్లల చదువుకోసం పేరెంట్స్ పడుతున్న కష్టాలు చూశాను… కాబట్టి పిల్లల చదువుకయ్యే మొత్తం ఫీజులను నేనే భరిస్తా అని పేర్కొన్నారు. తను ప్రభుత్వంలోని వచ్చే మహిళలకు సున్నా వడ్డీకే డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తానని చెప్పారు. అలాగే.. రైతులకు రుణ మాఫీలను చేస్తానని హామీ ఇచ్చారు జగన్.