సినీ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జయప్రద భద్రతకు ముప్పుందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ శాఖ ఆమె భద్రత కోసం17మంది సిబ్బందిని కేటాయించారు. వీరిలో ఐదుగురిని జయప్రద ఇంటి వద్ద కాపాలాగా ఉంచుతామని, మిగిలిన వారు షిఫ్టుల వారీగా ఆమెకు ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్ ప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. అయితే ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్థి అజంఖాన్‌తో జయప్రద పోటీ పడుతోన్న విషయం తెలిసిందే.