‘మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పండి !’ ప్రధాని మోదీకి తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రీన్ సూటి ప్రశ్న

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ నేతలు తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్  ఓబ్రీన్ సూటిగా  ప్రశ్నించారు.

మీ ముఖ్యమంత్రి  అభ్యర్థి ఎవరో చెప్పండి !  ప్రధాని మోదీకి   తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రీన్ సూటి ప్రశ్న
Derek O'brien

Edited By:

Updated on: Mar 18, 2021 | 6:21 PM

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ నేతలు తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్  ఓబ్రీన్ సూటిగా  ప్రశ్నించారు. మా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. మరి మీ సీఎం అభ్యర్థి ఎవరని ఆయన ముఖ్యంగా ప్రధాని మోదీని ప్రశ్నించారు. మీది వినాశనకర పార్టీ అని,    మీ సీఎం  అభ్యర్థి ఎవరో ఎందుకు ప్రకటించడం లేదని ఆయన అన్నారు. మీరు ఫలానా ఏ లేదా బీ లేక సీ అని ఎవరినైనా ప్రకటిస్తే ఇక మీకు తిరుగుబాటే తప్పదని ఆయన హెచ్చరించారు.  తాను సవాల్ చేస్తున్నానని,  మీ సీఎం అభ్యర్థి పేరు ప్రకటించాలని ఆయన అన్నారు. బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ నుంచి ఈ మధ్యకాలంలోనూ, అంతకు ముందు పెద్ద సంఖ్యలో సినీ, టీవీ స్టార్స్ కూడా బీజేపీలో చేరిన విషయాన్నీ ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. వీరిలో మిథున్  చక్రవర్తి, సీనియర్ నేత సువెందు అధికారి వంటివారెందరో ఉన్నారు.  ప్రధాని, హోం మంత్రి  హామీలు ఇస్తారని, కానీ వాటిని అమలు చేయరని డెరెక్ ఆరోపించారు.  డీమానిటైజేషన్ తదితరాల అంశాన్ని ఆయన గుర్తు చేశారు. మీ చర్యలవల్ల ప్రజానీకం ఇబ్బంది పడలేదా అని ప్రశ్నించారు.

పురూలియా లో గురువారం జరిగిన తమ పార్టీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. బెంగాల్ లో అవినీతి పెరిగిపోయిందని, దీనికి బీజేపీ అడ్డుకట్ట వేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఇంకా సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని  అయన పలు మార్లు దుయ్యబట్టారు.  కౌంట్ డౌన్  మొదలైందని, మే 2 న మమత అధికారం నుంచి నిష్క్రమించడం ఖాయమని ఆయన అన్నారు.  కాగా – డెరెక్.. మరి మీ పార్టీ నేతల అవినీతి మాటేమిటన్నారు. మీ మంత్రివర్గ సభ్యుల్లో కొందరిపై అవినీతి ఆరోపణలు లేవా అని  ఆయన ప్రశ్నించారు.  బెంగాల్ ఎన్నికలకు తరుణం దగ్గర పడుతుండగా ఇలా నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయిలో చెలరేగుతున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చదవండి: Mumbai Crime : గర్ల్‌ఫ్రెండ్ ఇంటికే కన్నం వేసిన డాక్టర్.. ఇళ్లు చూస్తానంటే తీసుకెళ్లిన ప్రియురాలికి ఊహించని షాక్..

Kamal Haasan’s Silambaram Skills : ఓటర్లను ఆకట్టుకోవడానికి కమల్ కర్రసాము.. తండ్రి టాలెంట్‌కు కూతురు ఫిదా..!