
ఏపీలో వెయ్యి శాతం టీడీపీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ నేత ఆనందబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్‌ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని అన్నారు. అయితే ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని ఆయన ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ తీరుతో వ్యవస్థలపై నమ్మకం పోతోందని నక్కా పేర్కొన్నారు.