ఏపీ ఓటర్లు మార్పు ఆశించే జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. టీడీపీ ఓటమిని అంగీకరిస్తున్నామని.. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం, ధైర్యం ఇవ్వడానికే తొడగొట్టి ఛాలెంజ్ చేశానని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యానించలేదని అన్నారు.